
బాహుబలి ఫీవర్ కామెన్ మెన్ లనే కాదు చీఫ్ మినిస్టర్ లను కూడా తాకింది. ఎంతలా అంటే.. సినిమా టికెట్ ను బ్లాక్ లో కొనేలా... తాను పెట్టిన నిబంధనలనే తానే అధిగమించేలా...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో సినిమా టికెట్ ధర లను ఇష్టానుసారంగా పెంచడంపై చర్యలు చేపడుతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
టికెట్ ధర రూ. 200 మించొద్దని త్వరలో చట్టం తీసుకొస్తానని ప్రకటించారు.అయితే బాహుబలి సినిమా కోసం ఇప్పుడు ఆయనే ఆ నిబంధనలను తుంగలోతొక్కారు.
తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బెంగళూరులోని ఓరియన్ మాల్‌లోని గోల్డెన్ క్లాస్‌లో లో బాహుబలి సినిమా చూశారు. ఇందుకోసం ఆయన ఒక్కో టికెట్ కు ఎంత చెల్లించారో తెలుసా... అక్షరాలా రూ.1050.
ఇంతకీ ఆయన ఎంతమందికి టికెట్ తీసుకున్నారో తెలుసా... 40 మందికి..అంటే మొత్తంగా రూ. 42 వేలు కేవలం టికెట్ ల కోసమే ఖర్చు చేశారని తెలుస్తోంది.
అంటే ఆయన పెట్టిన పరిమితికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువ పెట్టి బాహుబలి సినిమా చూశారు.
అయితే ఇలా సాక్షాత్తు సీఎం బ్లాకులో టికెట్ లు కొనడంపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన సీఎంవో ... తన మనవలు సినిమా చూడాలని పట్టుబట్టడంతో కాదనలేక సీఎం సినిమాకు వెళ్లారని వివరణ ఇచ్చాయి.