
ఒంటినొప్పులతో ఇబ్బంది పడుతున్నారా... మందులు వాడినా తగ్గడం లేదా... అయితే మందు కొట్టండి ఇట్టే తగ్గిపోతుంది అంటున్నారు గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకులు.
చాలా మంది పెయిన్ కిల్లర్ గా పారసిటమాల్ మాత్రను వాడుతుంటారు. అయితే దానిక కన్నా బీరు తాగితే మంచి ఫలితం ఉంటుందట. పెయిన్ కిల్లర్ గా పారసిటమల్ మాత్ర కంటే బీరే బాగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని చెబుతున్నారు గ్రీన్‌విచ్ వర్సిటీ పరిశోధకులు.
400 మందిపై 18 రకాల పరిశోధనలు చేసిన అనంతరం తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలిపారు.
మెదడు గ్రాహకంపై పనిచేయడం ద్వారా నొప్పి తీవ్రతను, ఆందోళనను బీరు తగ్గిస్తుందా...? లేదా ? అనే విషయంపై అధ్యయనం చేశామని, బీరు తాగిన వ్యక్తులకు తక్కువ నొప్పి ఉన్నట్లు తమ పరిశోధనలో రుజువైందని తెలిపారు.
పారసిటమాల్ మాత్ర వేసుకున్న వారికంటే ఆల్కహాల్ తీసుకున్న వారిలో ఈ తేడా ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు.