అణ్వాయుధాల నిర్మూలన సంస్థకు నోబెల్ శాంతి బహుమతి

First Published Oct 6, 2017, 4:00 PM IST
Highlights
  • అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐసీఏఎన్ అనే సంస్థ నోబెల్ శాంతి బహుమతి దక్కింది
  • అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల మానవాళికి జరిగే నష్టాన్ని ఈ సంస్థ విస్తృతంగా ప్రచారం చేసినట్లు తెలిపారు.

అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐసీఏఎన్( ఇంటర్నేషనల్ కాంఫైన్ టూ అబూలిష్ న్యూక్లియర్ వెపన్స్) అనే సంస్థ నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు నార్వేకు చెందిన నోబెల్ కమిటీ చీఫ్ బెరిట్ రెయిస్ ఆండర్సన్ తెలిపారు. అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల మానవాళికి జరిగే నష్టాన్ని ఈ సంస్థ విస్తృతంగా ప్రచారం చేసినట్లు తెలిపారు. ఐసీఏఎన్ ప్రపంచంలోని 101 దేశాల్లో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఈ సంస్థకు 468 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి.

 

నోబెల్ శాంతి బహుమతి గురించి ఆసక్తికర విశేషాలు..

1.1901 నుంచి 2017 వ సంవత్సరం వరకు శాంతి విభాగంలో 98 నోబెల్ బహుమతులు అందజేశారు.

2.రెండు నోబెల్ శాంతి బహుమతులను ముగ్గురికి అందజేశారు.

3.ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతిని 16మంది మహిళలు అందుకున్నారు.

click me!