ఏసియానెట్ తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

Published : Oct 06, 2017, 01:00 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ఏసియానెట్ తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

సారాంశం

నేటి విశేషాలు: తెలంగాణలో ఏ ఎన్నికజరిగినా ఫలితాలిలాగే ఉంటాయి యుకె తెలంగాణ కుటుంబానికి వెల్లువెత్తిన సానుభూతి, మద్దతు వియ్యంకుడు నారాయణ కళాశాల మీద మంత్రి గంటా సీరియస్ కొండచిలువను హతమార్చిన అనంతపురం జిల్లా గ్రామస్థులు

లండన్ లో స్వాతి మృతి పట్ల అనుమానం

వరంగల్‌కు చెం దిన స్వాతి అనే వివాహిత లండన్‌లో హఠాత్తుగా మరణించడం మీద తల్లితండ్రులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కట్నం చాలదని అత్తింటివారే తమ కూతురు స్వాతిని చంపారంటూ వారు బంధువులతో కలసి హన్మకొండలోని భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీకి చెందిన స్వామినాథన్, భారతి దంపతుల కుమార్తె స్వాతికి ఆ ఊరికే చెందిన శ్రీపతి శ్రీనివాస్ కుమారుడు రాజేశ్‌కు  2016లో వివాహం జరిగింది . పెళ్లైన కొద్ది రోజులలో రాజేశ్‌కు లండన్‌లో ఉద్యో గం రావడంతో భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని మృతురాలి బంధువులు చెబుతున్నారు. అక్టోబర్ 2న తమ కూతురు ఫోన్ చేసి భర్త, అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పినట్లు తండ్రి స్వామినాథన్ తెలిపారు. బుధవారం రాత్రి రాజేశ్ ఫోన్ చేసి స్వాతి చనిపోయిందని చెప్పాడని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు కట్నం కోసమే తమ కూతురిని పొట్టను పెట్టుకున్నారని స్వాతి బంధువులు ఆరోపిస్తూ రాజేశ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

కోదండరాం జీవితంలో సర్పంచ్‌గానైనా గెలిచాడా?

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టీబీజీకేఎస్‌ విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన  మీడియా సమావేశం మొత్తం   కోదండరాం చుట్టూ తిప్పారు. ఒక్క మాటలో చెబితే కోదండరామ్ పెద్ద సున్న అన్నారు.  ఆయన  తనకు తాను పెద్దగా ఊహించుకుంటున్నారని, ఆయన సభలకు 500 మించి జనం రారని అన్నారు. టీబీజీకేఎస్‌ గెలిస్తే సింగరేణి నాశనం అవుతుందని ఎలా అంటారని కేసీఆర్ ప్రశ్నించారు. కోదండరాం జీవితంలో సర్పంచ్‌గానైనా గెలిచారా? అని సీఎం ప్రశ్నించారు.  కోదండరామ్  పిలుపు ఇచ్చాడని  మీడియా రాస్తున్నది, పిలుపు ఇవ్వడానికి ఆయన హోదా ఏమిటి; ఆయనేమయినా ఆయన జాతీయ నాయకుడా అని ఎద్దేశా చేశారు.  కోదండరాం ఏమైనా మహాత్మగాంధీనా? అసలు జేఏసీ ఏర్పాటు చేసింది తానని, ఆపేరు పెట్టిందితానని  అన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసింది టీఆర్‌ఎస్సేనని, 2001లో పార్టీ పెట్టినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎవరేం పనిచేశారో ప్రజలకు తెలుసునని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

విశాఖ  రానున్న వాల్ మార్ట్ మాల్

ప్రపంచంలో పేరు మోసిని సూపర్ మార్కెట్ వాల్ మార్ట్ విశాఖ లో  బ్రాంచ్ ప్రారంభించనున్నది. విశాఖ ఆటోనగర్ ప్రాంతంలో ఇది ఏర్పాటవుతున్నదని సమాచారం. ఇతర సూపర్ మార్కెట్ లకి, వాల్ మార్ట్ కి కొంత తేడా ఉంటుంది. వాల్ మార్ట్ లో అని హోల్ సేల్ రేట్లకే దొరుకుతాయి. అయితే, వాల్ మార్ట్ కొనేందుకు సభ్యత్వం అవసరం. వాల్ మార్ట్ పనితీరు ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఎపుడైనా ఫలితాలిలాగే ఉంటాయి

సింగరేణి ఎన్నికల్లో గెలిచిన  సంబురం టిఆర్ ఎస్ లో మిన్నంటింది. దీనిని  కెసిఆర్ ప్రభుత్వంమీద ప్రజల తీర్పుగా వివరించేందుకు ఎవరి స్థాయిలో వారు అంతా కృషిచేస్తున్నారు. ఇపుడు ఏ ఎన్నిక  జరిగినా ఫలితాలిలాగే ఉంటాయని నిజాంబాద్ ఎంపి కవిత ప్రకటించారు. శుక్రవారం  నాడు విలేకరులతో మాట్లాడుతూ అమె సింగరేణి ఎన్నికల విజయం మీద స్పదించారు.సింగరేణి కార్మికులకు ఇచ్చిన హమీలన్నీ నెరవేరుస్తామని టిబిజెకెఎస్ గౌరవాధ్యక్షురాలు కూడా అయిన  కవిత స్పష్టంగా చెప్పారు.   సింగరేణి చరిత్రలో  ఎవరికీ ఎన్నడూ విజయం రాని విధంగా అత్యధిక డివిజన్ల లో తాము గెలిచామని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంపై సింగరేణి కార్మికులకు అపార విశ్వాసం ఉందని వెల్లడైందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు వస్తాయని కవిత పేర్కొన్నారు. సింగరేణి కార్మిక ఎన్నికలలో  టిబిజెకెఎస్ 11 డివిజన్లలో9 కైవసం చేసుకుంది.

 ‘ఉదయం’ న్యూస్ పేపర్ మళ్లీ వస్తున్నదట

తెలుగు రాష్ట్రాలు రెండింటినీ ప్రతి ఉదయమూ మరొక ‘ఉదయం’ కూడా పలకరించబోతోంది.  ఉదయం అంటే తెలుసుకదా, ఒక నాటి సంచలన  తెలుగు పత్రిక.  అప్పట్లో దాసరి నారాయణరావు, ఎబికె ప్రసాద్  సారథ్యంలో సంచలన రాజకీయ వార్తలను కొత్త కోణం నుంచి విశ్లేషిస్తూ వచ్చిన వినూత్న ప్రయోగం.  తెలుగు పాఠకులను ఎంతగానో అలరించిన ఉదయం కొన్నేళ్ల తర్వాత చేతులు మారి చివరకు మూత పడింది. ఈ టైటిల్ తో ఒక దినపత్రిక వచ్చే ఏడాది ఆరంభంలోనే రాబోతున్నదని చెబుతున్నారు.   వచ్చే ఏడాది ఉగాది నాటికి ప్రారంభం కావచ్చునని కూడా అనుకుంటున్నారు.దీని వెనక ఒక ప్రధాన టివి సంస్థ ఉందని, అదే తెలుగు కన్నడ భాషలలో ఉదయం టైటిల్ తోనే పత్రిక తెస్తున్నదని విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు జరిగే సంవత్సరం దగ్గర పడుతూ ఉండడంతో... ఉదయం తీసుకువచ్చేందుకు ఈ టివి సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. 

కానిస్టేబుల్‌ ఆత్మహత్య (బ్రేకింగ్ )

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తాని(31) ఇంట్లో ఉరివేసుకొని ఒలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది

యుకె తెలంగాణ కుటుంబానికి వెల్లువెత్తిన సానుభూతి, మద్దతు

​​​

గత శనివారం నాడు లండన్ లోని స్విండన్ లో ఒక టాక్సి కొట్టడంతో  మరణించిన ఖమ్మం వాసి మున్నలూరి శ్రీధర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు అక్కడి భారతీయులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. శ్రీధర్ అక్కడ ఎంత మంచిపేరుందంటే, ఆయన కుటుంబానికి వస్తున్న సానుభూతి సందేశాలు ఆగడమే లేదు. ఆయన మృతి అందరిని కలచివేసింది.దేశ విదేశాలనుంచి  కుటుంబానికి  సానుభూతి వెల్లువెత్తింది. ఇంకా అనేక మంది ఆయన భార్యను కలసి పరామర్శించి వెళుతున్నారు.  లండన్ హిందూ టెంపుల్ మొదలుపెట్టిన శ్రీధర్ కుటుంబ సహాయనిధికి కూడా బాగా విరాళాలొస్తున్నాయి. ఇంతవరకు  40500 వేల పౌండ్లు వసూలయింది. శ్రీధర్ అక్కడి పొలారిస్ హౌస్ లోని యుకె షేర్డు బిజినెస్ సర్వీసెస్ పనిచేస్తున్నాడు. హిందూటెంపుల్ ట్రస్టు ఛెయిర్మన్ ప్రదీప్ భరద్వాజ్ ఈ సహాయనిధి  ఏర్పాటు చేశారు.శ్రీధర్ గురించి విన్నతర్వాత చదివిన తర్వాత విదేశాలలో ఉన్నభారతీయులు కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారని ప్రదీప్ చెప్పారు. ఇక్కడి భారతీయ సమాజం ఒక మంచి మిత్రుని, హిందువుని కోల్పోయిందని ఆయన విచారంతో చెప్పారు. 

గుంటూరు లో వాన

బ్రేకింగ్ 1.30 pm

అమరావతి సచివాలయం చుట్టుపక్కల గ్రామాలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. గంట నుంచి ఏకధాటిగా వర్షం వస్తున్నది.ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.రోడ్లు మొత్తం జలమయం. ఇళ్ల నుండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.

వియ్యంకుడు నారాయణ కళాశాల మీద మంత్రి గంటా సీరియస్

​​​

కడ‌ప నారాయ‌ణ క‌ళాశాల గ‌ర్ల్స్ క్యాంపస్ లో పావని అనే  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకోవడంపై మంత్రి గంటా శ్రీనివాస‌రావు సీరియ‌స్  అయ్యారు. నారాయణ  ఆయన వియ్యంకుడు, మంత్రి వర్గం సహచరుడు. ఈ సంఘటన జరగడం పట్ల క‌ళాశాల యాజ‌మాన్యంపై  తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.విద్యార్థిని పావని మృతిపై ఆయన తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తూ  ఈ ఘ‌ట‌న‌పై క‌డ‌ప జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ నేతృత్వంలో విచార‌ణ‌ జరుగుతుందని మంత్రి గంటా  వెల్లడించారు. ఈ దర్ఘటన  మీద ఇంట‌ర్మీడియ‌ట్ విద్యాశాఖ క‌మీష‌న‌ర్ తో  కూడా ఆయన మాట్లాడారు. ఎవరి క‌ళాశాల అయినా క‌ఠిన‌ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయన  స్ప‌ష్టం చేశారు.  కడప జిల్లాలోని సిద్ధవటం మండలం భాకరాపేటకు చెందిన పావని కడప నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్నది. ఆమె అక్కడి హాస్టల్ లో నేఉంటున్నది. అయితే  శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

కొండచిలువను హతమార్చిన అనంతపురం జిల్లా గ్రామస్థులు

​​​

అనంతపురం జిల్లా కనగాని పల్లె మండలం శివపురం గ్రామస్తులు ఒక కొండచిలువను పట్టి హతమార్చారు. గ్రామస్థులు పొలంలో పనిచేస్తున్నపుడు ఈ కొండచిలువ అక్కడి ఒక గొర్రె ను మింగేయబోయింది.అది వారి కంటపడింది. వెంటనే గొర్రెను కాపాడారు. కొండచిలువను నరికి చంపేశారు. ఇది ఇంతకు ముందు నాలుగు గొర్రలను మింగేసిందని గ్రామస్థుల కోపం. చంపేసి ఇలా తీసుకెళ్లారు.

అక్టోబర్ 10న సిపిఎం చలో వంశధార

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకోసం జైలు కు పోయేందుకయినా సిద్ధమని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి మధు విజయవాడలో ప్రకటించారు. ఈ ప్రాజక్టు  వల్ల దాదాపు 10 వేల మంది ప్రజలు రోడ్డున పడుతున్నారని, నిర్వాసితులకు ఇంతవరకు న్యాయం జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో పోలీసులు సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం దారుణమని ఆయన అన్నారు.కాంట్రాక్టర్లకు మాత్రం అంచనాలు పెంచుతున్నా,  ప్రజలకు న్యాయం చేయడానికి డబ్బులు లేవా ? అని ప్రశ్నించారు.నిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరిపి, వారికి పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరుపై నిరసనగా ఈ నెల 10వ తేదీన అన్ని పార్టీలను కలుపుకుని ఛలో వంశధార నిర్వహిస్తామని అంటూ వంశధార నిర్వాసితుల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా వెనుకాడమని అన్నారు.

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !