లిటరేచర్ లో బ్రిటిష్ నవలా రచయితకు నోబెల్ బహుమతి

Published : Oct 05, 2017, 05:35 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
లిటరేచర్ లో బ్రిటిష్ నవలా రచయితకు నోబెల్ బహుమతి

సారాంశం

లిటరేచర్ విభాగంలో కజో ఇషిగురో అనే వ్యక్తికి నోబెల్ బహుమతి ప్రకటించారు రుడియార్డ్ కిప్లింగ్ అనే వ్యక్తి 41ఏళ్ల వయసులో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘జంగిల్ బుక్’ పుస్తక రచయిత ఈయనే.

లిటరేచర్ విభాగంలో గురువారం కజో ఇషిగురో అనే వ్యక్తికి నోబెల్ బహుమతి ప్రకటించారు. తన నవలలో భావోద్వేగ శక్తి నింపుతూ వాటిని ప్రపంచానికి అందజేసినందుకు గాను ఇషిగురోని ఈ నోబెల్  బహుమతి వరించింది. బ్రిటీష్ నవలా రచయిత అయిన ఇషిగురో పుట్టింది జపాన్ లోని నాగసాకిలో. ఆయనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఈయన పలు సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా పని చేశారు.

లిటరేచర్ లో నోబెల్ బహుతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

1. 1901 నుంచి 2017వ సంవత్సరం వరకు లిటరేచర్ విభాగంలో 110 నోబెల్ బహుమతులు అందజేశారు.

2. ఇప్పటివరకు లిటరేచర్ విభాగంలో 14మంది మహిళలు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.

3. లిటరేచర్ విభాగంలో 4 నోబెల్ బహుమతులను ఇద్దరిద్దరికీ చొప్పున అందజేశారు.

4.లిటరేచర్ విభాగంలో నోబెల్ అందుకున్న వ్యక్తి అతి తక్కువ వయసు 41 కాగా, ఎక్కువ వయసు 88.

5.రుడియార్డ్ కిప్లింగ్ అనే వ్యక్తి 41ఏళ్ల వయసులో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘జంగిల్ బుక్’ పుస్తక రచయిత ఈయనే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !