
జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాల్లో అనూహ్యా మార్పులను చూశాం. తమిళనాడులో ఏకంగా రాజకీయ సంక్షోభం ఎర్పడింది. రెండు నెలల పాటు క్షణ క్షణ మార్పులను దేశ వ్యాప్తంగా అందరు గమనించారు. కానీ
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ వెలితి ఏర్పడలేదని శశికళ భర్త నటరాజన్ అన్నారు.
నటరాజన్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, జయ మరణంతోను తమిళనాడులో పెద్దగా తేడా ఏమీ లేదని, నాడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని తెలిపారు. జయలలిత మరణం తరువాత వెలితి ఏర్పడుతుందని అందరు భావించారని, అలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రధాని నెహ్రూ మరణం అనంతరం రాజకీయ వెలితి ఏర్పడుతుందని భావించిన తరుణంలో లాల్ బహుదూర్ శాస్త్రి వచ్చారని జ్యోస్యం చెప్పారు.
అయితే ఇదే విషయం పై అక్కడి అన్నా డిఎంకే నేతలు మండి పడుతున్నారు. తమిళ ప్రజలు కూడా ఆయన పై విమర్శలు చేస్తున్నారు.