నంద్యాల ఉప ఎన్నిక చరిత్రలో నిల్చిపోతుంది, ఎందుకో తెలుసా?

Published : Aug 02, 2017, 01:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నంద్యాల ఉప ఎన్నిక చరిత్రలో నిల్చిపోతుంది, ఎందుకో తెలుసా?

సారాంశం

ప్రభుత్వం అధికార దుర్వినియోగం, ఖర్చకు సంబంధించి నంద్యాలలో చూస్తున్నది  కనివిని ఎరుగనిది. ఎన్నికల కమిషన్ ఖర్చు తీరును గమనిస్తున్నదో లేదో తెలియదు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు సంబంధించిన నంద్యాల ఉప ఎన్నికల ఖరీదయిన ఎన్నికగా ఎన్నికల చరిత్రలో నిలవబోతున్నది.

ప్రభుత్వం అధికార దుర్వినియోగం, ఖర్చుకు సంబంధించి నంద్యాలలో చూస్తున్నది  కనివిని ఎరుగనిది.

ఎన్నికల కమిషన్ ఖర్చు ను గమనిస్తున్నదో లేదో తెలియదు.   ప్రభుత్వం చేస్తున్న ఖర్చకు సంబంధించిన నంద్యాల ఉప ఎన్నికల ఖరీదయిన  ఎన్నికగా  ఎన్నికల చరిత్రలో నిలవబోతున్నది. ప్రృభుత్వం  నుంచి హామీలు, అభివృద్ది కార్యక్ర మాలు, అధికార పార్టీ నుంచి పరోక్షంగా మరికొన్ని పంపిణీలు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయానుభవాన్నంతా  నంద్యాలలో పరీక్షకు పెడుతున్నారనిపిస్తుంది.

 

ఇప్పటికే టీడీపీ వోటర్లకి పంచినవి .

--16 వేల కుట్టుమిషన్లు 
--10 వేల పక్కా ఇల్లు 

-- నంద్యాల మండలం కానాల లో సిసి రోడ్డు

-- ఎన్టీఆర్ కాలనీ మంజూరు

-- అన్నా క్యాంటీన్  ప్రారంభం

--వోటున్న ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పెన్షన్ .
--అడిగిన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు 

-- రైతు సంఘం భవన నిర్మాణం

-- నంద్యాల సుందరీకరణ

- ట్రాక్టర్ల పంపిణీ

-- స్మార్ట్ సిటిగా నంద్యాల

-- నంద్యాల ఎప్పటినుంచో పెండింగులో ఉన్న రోడ్ల వెడల్పు కార్యక్రమం

ఇంకా, పార్టీ పరంగా


--100 వోట్లున్న ప్రతి గల్లీ నాయుకుడికి  ఓటర్ల బాగోగులు చూసుకునేందుకు ఖర్చులు 
--ప్రతివోటును పరిగణనలోనికి తీసుకురాలి. (చంద్రబాబు వోటు రు.  అయిదు వేల ఇవ్వగల శక్తి  ఉందన్నారు).

--ప్రభుత్వ పధకాలు , రోడ్లు విస్తరణ అంతా కలిపి రు. 1600 కోట్ల నుంచి రు.2000 కోట్ల దాకా  కేటాయింపు . 
--ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు దఫాలుగా నాలుగు రోజుల పర్యటన పూర్తి., నాయకులను పిలిపించుకుని టిడిపిలోకి రమ్మని బుజ్జగిస్తున్నారు.
--మాట వినని వారిపై సంగతి ‘మరొక’ విధంగా చూస్తున్నారు. కేసులు బనాయింపు , వ్యాపారస్తులకు బెదిరింపులు , ప్రతిపక్ష నాయకుల కిడ్నాపులు జరుగుతున్నాయని వైసిపి ఆరోపిస్తున్నది . 

--ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ కూడా ఒక సారి పర్యటించారు. ఇక ఆయన అక్కడే మకాం వేస్తారట.

-ఇవి కాకుండా కులాల వారీగా ఓటర్ల లిస్ట్ సేకరించి అటునుంచి నరుక్కొచ్చే బాధ్యతలను ఆయా కులాలకు చెందిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేటాయించారు . ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు , 8 మంది మంత్రులు మకాం నంద్యాలకు మర్చారు . మరో 8 మంది మంత్రులు ఇంకో 20 మంది ఎమ్మేల్యేలు నేడో రేపో రావచ్చు. 

భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా నంద్యాల చరిత్రలో నిలవబోతున్నదా

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !