రాహుల్ కోసం చార్జీలలో రాయితీ ప్రకటించిన ఆటో డ్రైవర్

First Published Oct 10, 2017, 3:31 PM IST
Highlights

రాహుల్ దర్శనం కోసం ఒక  అభిమాని  చేసిన వినూత్న ప్రయోగం

 

పిరోజ్ మోమిన్  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిమాని. వదోదరాలో అటో నడుపుతూ జీవిస్తుంటాడు.  రాహుల్ వదోదర వస్తున్నాడని ఆయనకు తెలిసింది. రాహుల్ గాంధీని కలవాలని ఉంది. అయితే, తన లాంటి వాడికి సాధ్యంకాదు. అందువల్ల, రాహుల్ కంటపడటం ఎలా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఆయన తన ఆటో లో ప్రయాణం చేసిన వారికి 18 శాతం రాయితీ అని ప్రకటించాడు. అంతే, ఈ వార్త దావానలంలా వ్యాపించి పోయింది. తన నిర్ణయం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నది కాదని మోమిన్ చెబుతాడు. తన అభిమాననేతను కలుసుకోవడం మినహా ఇందులో ఎలాంటి రాజకీయం లేదు అంటాడు.  తన ఆటో చార్జీల నిర్ణయాన్ని అమలుచేసేందుకు వెంటనే ఒక వైపు రాహుల్ గాంధీ పోస్టర్ అతికించాడు. మరొక వైపు రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఆటో చార్జీలలో రాయితీ అనే పోస్టర్ కూడా తగిలించాడు. గుజరాత్ కనెక్ట్ వెబ్ సైట్ సమాచారం ప్రకారం,  ఇది అర్ధిక భారమే అని మోమిన్ అంటున్నాడు. తన అభిమాన నేత కోసం దీనిని తాను భరించగలుగుతానని ఆయన చెప్పాడు. మోమిన్ కొన్ని కుటుంబాలకు రెగ్యులర్  సేవలందిస్తారు. వాళ్లకి ఈ విషయం చెప్పినపుడు అభినందించారని, తర్వాతపూర్తి చార్జీలు చెల్లించారని మోమిన్ చెప్పాడు.

 

 

 

 

click me!