నిధారి కేసులో దోషులకు ఉరిశిక్ష

First Published Jul 24, 2017, 5:56 PM IST
Highlights
  • 19మందిని హత్య చేశారు
  • రేరెస్ట్  ఆఫ్ ది రేర్ కేస్ గా గుర్తింపు
  • స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు

 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19మందిని అతి కిరాతకంగా హత్య చేశారు. వారిని వారిలో కొందరు మహిళలు, యువతులు, మరికొందరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఈ రోజు దిల్లీ స్పెషల్ సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..

 

నోయిడాకు చెందిన వ్యాపారవేత్త మోనిందర్ సింగ్, అతని సర్వర్ సురిందర్ కోలిలు 2006వ సంవత్సరంలో పింకీ సర్కార్ అనే 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం యువతిని రేప్ చేసి.. హత్య చేశారు.

బయటకు వెళ్లిన పింకి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి.

పింకీతో సహా 19మందిని కూడా వీరు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతిచెందిన వారిలో యువతులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 19మందిలో 16మంది హత్యకేసులో వీరిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. మృతులంతా దిల్లీకి సమీపంలోని నిథారి అనే ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ఈ కేసు సంచలనం సృష్టించింది.

ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ గా పరిగణించి మోనిందర్ సింగ్, సురిందర్ కోలిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

 

click me!