పాలకుల అలసత్వం ఆమె ప్రాణాలు తీసింది

Published : Jul 24, 2017, 04:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పాలకుల అలసత్వం ఆమె ప్రాణాలు తీసింది

సారాంశం

ట్రక్కు కింద పడి మహిళా బైకర్ దుర్మరణం గుంతల మయంగా ముంబయి రహదారులు

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా బైకర్‌  దుర్మరణం చెందిన సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘వుమెన్‌ ఓన్లీ బైకర్స్‌’ క్లబ్‌కు చెందిన 34 ఏళ్ల జాగృతి విరాజ్‌ తన బృందంతో కలిసి ద్విచక్రవాహనాలపై ముంబయిలోని బాంద్రా నుంచి జవహర్‌ ప్రాంతానికి వారాంతపు సెలవులను గడిపేందుకు బయలుదేరింది.

కాసేపటికే భారీ వర్షం పడి రోడ్డు చిత్తడిగా మారింది. రోడ్డుపై ఉన్నగుంతను తప్పించబోతుండగా ఆమె అదుపుతప్పి కిందపడింది. అదే మార్గంలో వస్తున్న ఓ భారీ ట్రక్కు ఆమె నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమెతోపాటు వస్తున్న స్నేహితులు ఈ ఘటనను చూసి చలించిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ముంబయి నగరంలో రహదారులు గోతులమయమై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని..రహదారులు బాగు చేయాల్సిందిగా కోరుతూ  కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా  అధికారులు స్పందించడం లేదు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !