10వేల మైలురాయిని తాకిన నిఫ్టీ

First Published Jul 25, 2017, 12:17 PM IST
Highlights
  • తొలిసారి ఈ ఘనత సాధించిన నిఫ్టీ
  • లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ 

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ నిఫ్టీ  మంగళవారం 10వేల మైలురాయిని తాకింది. నిఫ్టీ ఈ మైలురాయిని చేరుకోవడం మార్కెట్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. మదుపర్ల పెట్టుబడుల అండతో నిఫ్టీ ఈ ఘనత సాధించింది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో సోమవారం గరిష్ఠస్థాయిలో ముగిసిన సూచీలు.. మంగళవారం కూడా అదే జోరును కొనసాగించాయి. గతంలో ఒకసారి 10వేల మైలురాయికి 44 పాయింట్ల దూరంలో ఆగిపోయిన నిఫ్టీ.. మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభించిన కొద్ది క్షణాలకే 10వేల మార్క్ ని  తాకింది. 
ఈరోజు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్‌ కూడా లాభాల్లో ప్రారంభమైంది. క్రితం సెషన్లో 32,246 వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. ఈ ఉదయం 100 పాయింట్లకు పైగా లాభపడి.. 32,348 వద్ద ప్రారంభమైంది. 
 

click me!