
భారత మహిళల క్రికెట్ జట్టు 2017 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తరువాత కూడా దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు తాకుతూనే ఉంది. దేశంలో ఉన్న ప్రముఖుల అందరు మహిళ జట్టు చూపించిన స్పూర్తికి జేజేలు సపలుకుతున్నారు.
భారత మహిళ క్రికేట్ జట్టు సారథీ కి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ కప్‌లో పాల్గోన్న టీంలలో అద్బత ప్రదర్శన చేసిన వారిని ఒక జట్టుగా ఐసీసీ ప్రకటించింది. అందులో మన సారథీ అయిన మిథాలీ రాజ్‌ను మహిళల ప్రపంచకప్ 2017 జట్టు సారథిగా ఎంపిక చేసింది. ఇండియా నుండి మహిళ టీంలో ఐసీసీ ప్రకటించిన టీంకి కెప్టెన్‌గా సెలక్ట్ అవ్వడం మొదటి సారి. గతంలో మిథాలీ రాజ్ ఐసీసీ టీం కు సెలక్ట్ అయ్యారు, కానీ కెప్టెన్ గా కాదు. మిథాలీ తో పాటు మరో ఇద్దరు ప్రపంచ టీం కు సెలక్ట్ అయ్యారు. ప్రపంచ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టు నుండి నలుగురు మహిళ క్రికేటర్లు సెలక్ట్ అయ్యారు.
2017 ఐసీసీ జట్టు.
మిథాలీ రాజ్ (కెప్టెన్) - భారత్.
హర్మన్‌ప్రీత్ కౌర్ - భారత్.
దీప్తిశర్మ - భారత్
బ్యూమాంట్ - ఇంగ్లాండ్
ష్రబ్‌సోల్ - ఇంగ్లాండ్
సారా టేలర్ - ఇంగ్లాండ్
అలెక్స్ హార్ట్లీ - ఇంగ్లాండ్
లారా వోల్‌వర్త్ - దక్షిణాఫ్రికా
మరిజన్నె క్యాప్ - దక్షిణాఫ్రికా
డేన్ వాన్ నికెర్క్ - దక్షిణాఫ్రికా
ఎల్లీస్ పెర్రీ - ఆస్ట్రేలియా.