భారత్ లో డ్రైవర్ లెస్ కార్లు తిరగనట్టే..

Published : Jul 25, 2017, 11:37 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
భారత్ లో డ్రైవర్ లెస్ కార్లు తిరగనట్టే..

సారాంశం

భారత్ లో డ్రైవర్ లెస్ కార్లను అనుమతించం నిరుద్యోగం  పెరిగే అవకాశం తేల్చి చెప్పిన మంత్రి నితిన్ గడ్కరీ

టెక్నాలజీ కాలనికి అనుగుణంగా పరిగెడుతోంది. దీనిలో భాగంగానే.. గూగుల్ వంటి కంపెనీలు డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టెస్ట్ డ్రైవ్ లు కూడా చేశాయి. అయితే.. ఈ డ్రైవర్ లెస్ కార్లు భారత్ లోకి  అడుగుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకుంటే ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు.

డ్రైవర్ లెస్ కార్ల వద్ద నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని.. అందుచేత వాటిని భారత్ లో అంగీకరించమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు తెలిపారు. ఈ డ్రైవర్ లెస్ కార్లను అనుమతించే బదులు డ్రైవర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వగలిగితే.. దాదాపు 50లక్షల మంది ఉపాధి కల్పించగలుగుతామని ఆయన అన్నారు. అంతేకాక ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు.

త్వరలోనే ప్రతి ప్రైవేటు వాహనాల్లో జీపీఎస్, శాటిలైట్ ట్రాకింగ్ ని తప్పనిసరి చేయనున్నట్లు మంత్రి వివరించారు. డబుల్ డక్కర్ బస్సులు, లక్సరీ బస్సులలో విమానాలలో మాదిరి సదుపాయాలు కల్పిస్తామన్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !