మోసాల మహారాజుకు అమరావతిలో పట్టాభిషేకమా!

Published : Jul 20, 2017, 09:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
మోసాల మహారాజుకు  అమరావతిలో పట్టాభిషేకమా!

సారాంశం

ఎస్ ఆర్ ఎం యూనివర్శిటి వోనర్ పచ్చముత్తు విద్యార్థులను మోసగించిన చరిత్ర ఉంది చీటింగ్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు ఆయన మిత్రుడు కూడా  విద్యార్థులను మోసిగించాడు పచ్చముత్తుకు అమరావతిలో పట్టాభిషేకం 

అమరావతిలో ఎస్ ఆర్ ఎం అనే పేరుతో ఒక ప్రయివేటు యూనివర్శిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతవారం ప్రారంభించారు. అక్కడ విలువయిన200 ఎకరాల భూమిని యూనివర్శిటీకి కేటాయించారు.  యూనివర్శిటీ ప్రొప్రయిటర్  పచ్చముత్తును వేనోళ్ల పొడిగారు. ఈ యూనివర్శిటీకి, పచ్చముత్తు కు ఉన్న చెడ్డపేరు నాయుడు దాచ వచ్చు, ఇపుడున్న టెక్నాలజీ దాచలేదుగా. ఆయన గురించి ముచ్చటైన మూడు ముక్కలు:

  1. పచ్చముత్తు అనే వ్యక్తి అవినీతి ఊబిలో కూరుకుపోయి అనేక కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
  2. 420 కేసులోనూ, భూకబ్జా కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.

   3.లక్షల రూపాయలు వసూలు చేసి ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో సీట్లు ఇవ్వకుండా మోసం చేశారని పలువురు విద్యార్థులు చేసిన ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు 2016 ఆగస్టు 26న అరెస్టు చేసి జైలుకు పంపారు.

4. ఇదే వ్యవహారంలో పచ్చముత్తును ముఖ్యఅనుచరుడు, సినీ నిర్మాత మదన్‌ రూ.70 కోట్లతో పరారయ్యాడు.

5  జైలులోకూడా పచ్చ ముత్తు పెద్ద డ్రామా ఆడాడు.  గుండెనొప్పిఅనిపెద్ద హంగామా చేశారు. వైద్యులు పరీక్షలు చేసి ఉత్తుత్తి డ్రామా అన్నారు.

6. కోయంబేడు దగ్గర తమ భూమిని ఆక్రమించుకున్నారని డైశీరాణి, వి.శ్రీనివాసరావు మరికొందరు కలిసి పచ్చముత్తుపై కేసు పెట్టారు.

ఇలాంటి వ్యక్తి పవిత్ర అమరావతిలో అప్పటికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నయుడు పక్కనే కూర్చోబెట్టుకుని భజన చేశారు పొగడ్తలతో ముంచెత్తారు. అతనొక మహా వ్యక్తి అన్నారు. విద్యావేత్త అన్నారు. ఇందంతా చూస్తే అసలు అమరావతి ఎలాంటి నాలెడ్జ్ హబ్ అవుతుందో భయమమేస్తుంది.

పచ్చముత్తు గురించి లింకులు

  1. ది  హిందూ పత్రిక

http://www.thehindu.com/news/national/tamil-nadu/SRM-University-chancellor-Pachamuthu-arrested-in-cheating-case/articleece

2.ఎస్ ఆర్ ఎం యూనివర్శిటీ బ్యాడ్ యూనివర్శిటీ ఎందుకంటే... కోరాలో ప్రశ్న

https://www.quora.com/Why-is-SRM-University-considered-to-be-bad

 

3.పచ్చముత్తు అనుచరుడు మదన్ గురించిన కథనం

http://www.thenewsminute.com/article/producer-madhan-missing-whats-his-link-srm-did-he-cheat-parents-over-medical-seats-

  1. NDTV కథనం ఇది
Filmmaker Madhan Arrested In Alleged Multi-Crore Scam In SRM...

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !