న్యూసబుల్ రిపోర్టర్ పై శశి థరూర్ దురుసు ప్రవర్తన

Published : Sep 28, 2017, 05:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
న్యూసబుల్ రిపోర్టర్ పై శశి థరూర్ దురుసు ప్రవర్తన

సారాంశం

మహిళా రిపోర్టర్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ దురుసు ప్రవర్తన ఇంటర్వ్యూ అడిగితే.. సెక్యురిటీ గార్డుల చేత కొట్టించిన శశిథరూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా రిపోర్టర్

ఏషియా నెట్ న్యూసబుల్ మహిళా రిపోర్టర్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ దురుసుగా వ్యవహరించారు. ఇంటర్వ్యూ కావాలని అడిగినందుకు సెక్యురిటీ గార్డు చేత దారుణంగా కొట్టించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని  టెస్కో  కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్షతన ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ ని కవర్ చేసేందుకు ఏషియా నెట్ న్యూసబుల్ రిపోర్టర్ రోషిని, కెమేరామెన్ పీఎస్ రూప్ తో కలిసి అక్కడికి వెళ్లారు. వీరు అక్కడికి చేరుకున్న సమయానికి శశిథరూర్ కారులో అక్కడికి వచ్చారు.

దీంతో.. రిపోర్టర్.. ఎంపీ శశిథరూర్ ని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు నిరాకరించిన ఆయన .. తనతోపాటు కారులో కూర్చున్న ఓ వ్యక్తికి సైగలు చేశారు. వెంటనే ఆ వ్యక్తి కారులో నుంచి బయటకు వచ్చి సెక్యురిటీ గార్డులను పిలిచారు. ఆ సెక్యురిటీ గార్డులు వెంటనే.. రిపోర్టర్, కెమేరామెన్ పై దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో రిపోర్టర్ రోషిని దుస్తులు కూడా చిరిగిపోయాయి. అంత విచక్షణా రహితంగా దాడి చేశారు.  దాదాపు 8మంది సెక్యురిటీ గార్డులు దాడికి పాల్పడ్డారని ముఖ్యంగా సుబ్రాత్ అనే వ్యక్తి ఎక్కువ రెచ్చిపోయి వ్యవహరించాడని బాధితురాలు తెలిపారు. ఇదంతా తన కళ్ల ముందే జరుగుతున్నా శశిథరూర్ చూస్తుఉండిపోయారు. దీంతో ఆయనపై బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !