ఈ బెడ్ మీద పడుకుంటే.. ‘‘గురక’’ రాదు

First Published Jan 9, 2018, 1:25 PM IST
Highlights
  • గురక పెట్టే వ్యక్తితోపాటు.. పక్కన వారు కూడా ఇబ్బంది పడుతుంటారు.
  • అందుకే దీనికి స్మార్ట్ గా పరిష్కారం కనుగొన్నారు టెక్ నిపుణులు.

 ‘‘ గురక’’ ఈ సమస్యతో బాధపడేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. దీని వల్ల గురక పెట్టే వ్యక్తితోపాటు.. పక్కన వారు కూడా ఇబ్బంది పడుతుంటారు. మానసిక ఒత్తిడి, కంగారు, ఎక్కువగా ఆలోచించడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం.. ఇలా కారణం ఏదైనా గురక సమస్య మాత్రం తీవ్రంగా వేధిస్తుంటుంది. అందుకే దీనికి స్మార్ట్ గా పరిష్కారం కనుగొన్నారు టెక్ నిపుణులు.

లండన్ లో వచ్చే వారంలో సీఈఎస్ 2018 ప్రదర్శన జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిలో అమెరికాకు చెందిన స్లీప్ నెంబర్ కంపెనీ ఈ స్మార్ట్ బెడ్ ని ప్రదర్శించనుంది. ఈ స్మార్ట్ బెడ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..? గురకను నియంత్రిస్తుంది.

. ఉదాహరణకు ఇద్దరు భార్యభర్తలు.. ఈ బెడ్ మీద పడుకున్నారనుకుందాం. వారిలో ఒకరు గురక పెడితే.. పక్కన వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఈ బెడ్.. వారికి గురక రాకుండా చేస్తుంది. గురకపెట్టేవారి తల వైపు భాగం బెడ్ 7 డిగ్రీలు పెరుగుతుంది. దీంతో వారికి గురక రావడం తగ్గుతుంది. దీంతో.. ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

 కేవలం గురక సమస్య మాత్రమే కాదు.. బెడ్ నిద్రపోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ మాట్రెస్ కి కింద రెండు ఎయిర్ ఛాంబర్స్ ఫిక్స్ చేశారు. దీంతో.. ఎలా పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపట్టేస్తుంది. అంతేకాదండోయ్.. దీనికి అలారమ్ సెన్సార్ కూడా ఉంది. ఉదయాన్నే అదే నిద్ర లేపుతుంది. కాలానికి అనుగుణంగా కూడా ఈ బెడ్ ఉంటుందట. ఈ ప్రదర్శన అనంతరం ఈ స్మార్ట్ బెడ్ ని మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు.

click me!