కృత్రిమ ఆకు తయారు చేసిన పుణే సైంటిస్టులు

First Published Sep 6, 2017, 3:42 PM IST
Highlights
  • కృత్రిమ ఆకును తయారు చేసిన శాస్త్రవేత్తలు..
  • నీరు, సూర్యరశ్మి తీసుకొని.ఈ ఆకు . ఇంధనాన్ని విడుదల చేస్తుంది.

మొక్కలకు నీరు, సూర్యరశ్మే ఆహారం. గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సీజన్ ని అందిస్తాయి.అయితే.. ఈ మొక్క మాత్రం.. నీటిని పీల్చుకొని, సూర్యరశ్మిని ఉపయోగించుకొని   ఇంధనాన్ని అందిస్తుంది. వివరాల్లోకి వెళితే.. పలువురు శాస్త్రవేత్తలు.. ఒక కృత్రిమమైన ఆకును తయారు చేశారు. ఇది నీరు, సూర్యరశ్మిని తీసుకొని ఇంధనాన్ని విడుదల చేస్తుంది. ఈ ఇంధనాన్ని ఎకో  ఫ్రెండ్లీ కారులలో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆల్ట్రా వైర్ లెస్ డివైస్ తో శాస్త్రవేత్తలు మిమిక్స్ మొక్కను తయారు చేశారు. దీని ఆకులు ఇంధనాన్ని విడుదల చేస్తాయని వారు చెబుతున్నారు.

 

ఇంధనం, పర్యావరణ సమస్యలు దూరం చేయడానికి తాము రూపొందించిన ఆకు ఉపయోగపడుతుందని, ఇదే అత్యుత్తమ పరిష్కారమని సీఎస్‌ఐఆర్ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్టు చిన్నకొండ ఎస్‌ గోపీనాథ్‌ తెలిపారు. దీనిపై దశాబ్ద కాలంగా పరిశోధనలు చేశామన్నారు.

 

సహజ ఆకును పోలిన కృత్రిమ ఆకులో అర్ధవాహకాలు పేర్చామని, వాటిపై కాంతి పడగానే ఎలక్ట్రాన్లు ఓ దిశలో కదిలి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఆ విద్యుత్తు నీళ్ల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేస్తుందన్నారు. కాంతిని గ్రహించే శక్తిని పెంచడానికి ఆ ఆకులో బంగారు సూక్ష్మ అణువులను, టైటానియం డయాక్సైడ్‌, క్వాంటమ్‌ డాట్స్‌, వాడామన్నా రు. శిలాజ ఇంధనాల నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తున్నామని, దాని వల్ల భారీ స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల అయ్యి భూతాపానికి కారణం అవుతోందన్నారు. తాము తయారు చేసిన కృత్రిమ ఆకు 23 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటుందని, గంటకు 6 లీటర్ల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు.

 

మరిన్ని వార్తల  కోసం క్లిక్ చేయండి

 

click me!