
ఇండియా నుండి భారతీయులు నేరుగా అమెరికా ప్రయాణించాలనే కల నిజమయింది. ఇన్నాళ్లు ఇండియా నుండి అమెరికా వెళ్లాలంటే, మొదట ఇతర దేశాలను చేరుకొని తరువాత అమెరికా వెళ్లేవారు. కానీ ఇప్పుడు రూట్ మారింది. నేరుగా అమెరికా వెళ్లొచ్చు. అదే విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు తెలిపారు. ఆగష్టు మొదటి వారం నుండి అందుబాటులోకి రానున్నాయి. దేశంలో నుండి రాజధాని ఢిల్లీకి చేరుకుంటే అక్కడి నుండి డైరెక్ట్ గా అమెరికా చేరుకొవచ్చు. ఇక తెలుగు ప్రజలకు కాస్తా వెసులుబాటు కల్గింది. ఢిల్లీకి బదులుగా హైదరాబాద్ కి వస్తే అమెరికాకు వెళ్లొచ్చు. అమెరికా ప్రయాణించే విమానాలు అన్ని మొదట హైదరాబాద్ నుండే ప్రారంభమవుతాయి.
గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆయన ప్రకటించారు.
అమెరికాకు విమాన సర్వీసుల గురించి తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్ అడిగిన ప్రశ్నకు అశోక్ గజపతిరాజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. హైద్రాబాద్ - ఢిల్లీ - వాషింగ్టన్, తిరిగి వాషింగ్టన్ - ఢిల్లీ - హైద్రాబాద్ మార్గాల్లో ప్రభుత్వ సంస్థ అయినా ఎయిర్ ఇండియా నుండి ప్రయాణించవచ్చునని ఆయన పెర్కోన్నారు. ఈ సర్వీసులు ప్రతి బుధ, శుక్ర, ఆది వారాల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
అలాగే అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను మరింత పెంచుతామని ఆయన తెలిపారు. త్వరలో అమెరికాలోని లాస్ ఏంజెలీస్, హ్యూస్టన్ ప్రాంతాలకు కూడా అవసరాన్ని బట్టి విమాన సర్వీసులను కల్పిస్తామని అశోక్ గజపతిరాజు తెలియజేశారు.