జియో ఎఫెక్ట్ : బంపర్ ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్

Published : Aug 02, 2017, 12:14 PM ISTUpdated : Mar 24, 2018, 12:12 PM IST
జియో ఎఫెక్ట్ : బంపర్ ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్

సారాంశం

రూ.445తో వొడాఫోన్ 4జీ సిమ్ 84 రోజులపాటు రోజుకో 1జీబీ డేటా

జియో తాకిడిని తట్టుకునేందుకు ఇతర మొబైల్ నెట్ వర్క్ సంస్థలు బాగానే ప్రయత్నిస్తున్నాయి. జియో ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామని  రిలయన్స్ సంస్థ చెప్పగానే.. ఐడియా కూడా స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఇప్పడు వొడాఫోన్ వంతు వచ్చింది. జియో ఆఫర్ల తాకిడిని తట్టుకునేందుకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.

కొత్తగా వొడాఫోన్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ.445తో 4జీ సిమ్ ని అందజేస్తోంది. దీంతో 84 రోజుల పాటు రోజుకో 1జీబీ డేటాను పొందగలరు. అలాగే  అన్ లిమిటెడ్ కాల్స్ ని కూడా అందజేస్తోంది.  విద్యార్థులే లక్ష్యంగా ఈ ఆఫర్ పెట్టినట్లు వారు చెప్పారు. ఈ మేరకు దిల్లీ సమీపంలోని అన్ని కళశాలల్లో విద్యార్థులకు ఈ సిమ్ లను అందజేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ప్రతి నెలా రూ.352 తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని.. దీంతో కూడా అన్ని బెనిఫిట్స్ పొందవచ్చని వారు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu