
గత ఏడాది విశాఖలో సి ఐఐ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు తర్వాత ఆంధప్రదేశ్ కు 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఈ రోజు విశాఖ రెండవ సిఐఐ సదస్సులో ప్రసంగిస్తూ గత ఏడాది కుదిరికి 927 ఒప్పందాలలో659 ఒప్పందాలు ఆమోదం పొందాయని, ఇందులోనుంచి రు. 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు.
ఇలా పెట్టుబడులకు ఆకట్టుకునేందుకు దోహదపడుతున్న విశాఖ దేశంలో నే విశేషమయిన నగరమని, ఈ నగరాన్ని ఉత్తర నగరంగా తీర్చి దిద్దుతామని ఆయన ప్రకటంచారు.
రాజధాని అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈమహా కార్యంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని చెబుతూ గతేడాది జాతీయ సగటు వృద్ధిరేటు 7.5శాతంగా ఉంటే ఏపీ వృద్ధిరేటు 10.99 శాతంగా నమోదైందని ఆయనే చెప్పారు.
పోర్టు ఆధార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్, నీరు పుష్కలంగా ఉన్నాయి, పరిశ్రమల ఏర్పాటుకు భూముల కొరత లేదని చెబుతూ రాజధాని అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రాజధాని అంటే భవనాలు కాదని, ఆర్థిక నగరమని చంద్రబాబు అభివర్ణించారు. అమరావతిని హరితనగరంగా నిర్మిస్తామని ఇందులో భాగస్వాములు కావాలని ఆయన సదస్సుకు వచ్చిన వారిని కోరారు.