వివాదాస్పద ‘పద్మ’లు

First Published Jan 25, 2017, 11:18 AM IST
Highlights

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సంబంధాలుండే వారికి, సానుభూతిపరులకు, మద్దతుదారులకు పురస్కారాలు ఇచ్చేసుకోవటంతో అసలు పురస్కారాలకే విలువ తగ్గిపోయింది.

ఈ ఏడాదికి సంబంధించి కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డులపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. పలువురు రాజకీయనేతలు, వివాదాస్పద గురులుండటం గమానార్హం. అందులో కూడా పార్టీల వారీగా ప్రముఖ నేతలను ఎంపిక చేయటం విశేషం. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో పిఎ సంగ్మా, శరద్ పవార్, మురళీ మనోహర్ జోషి, సుందర్ లాల్ పట్వా తదితరులున్నారు. అదేవిధంగా తమిళనాడుకు చెందిన వివాదాస్పద గురువు జగ్గీ వాసుదేవ్ తో పాటు పలువురు సాధు, సన్యాసులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ప్రతీఏటా ప్రకటించే పద్మ పురస్కారాలు అత్యంత వివాదాస్పదమవుతుండటం గమనార్హం.

 

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సంబంధాలుండే వారికి, సానుభూతిపరులకు, మద్దతుదారులకు పురస్కారాలు ఇచ్చేసుకోవటంతో అసలు పురస్కారాలకే విలువ తగ్గిపోయింది. కాకపోతే ఈసారి ప్రకటించిన పురస్కారాల్లో తమ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేసేటపుడు భారతీయ జనతా పార్టీ కాస్త ముందుచూపుతో వ్యవరించినట్లు కనబడుతోంది. ఎందుకంటే, తమ పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన సంగ్మా, శరద్ పవార్ లాంటి వారిని ఎంపిక చేసిన తీరే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద 89 పద్మాలను కేంద్రం ప్రకటించగా అందులో 75 మందదికి పద్మశ్రీ, ఏడుమందికి పద్మ భూషణ్, మరో  మందికి పద్మ విభూషణ్ పురస్కారాలను అందించింది.

click me!