చంద్రబాబుతో సమావేశం...ఉన్న నేతలెంతమంది ?

Published : Oct 31, 2017, 04:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
చంద్రబాబుతో సమావేశం...ఉన్న నేతలెంతమంది ?

సారాంశం

‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు’ అన్న సామెతలాగ అయిపోయింది చంద్రబాబునాయుడు పరిస్ధితి. టిటిడిపిలోని మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు తెలంగాణా నేతలతో 2వ తేదీ భేటీ అవుతున్నారు.

‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు’ అన్న సామెతలాగ అయిపోయింది చంద్రబాబునాయుడు పరిస్ధితి. టిటిడిపిలోని మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిపోయారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ సమక్షంలో రేవంత్ తో పాటు పలువురు నేతలు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు తెలంగాణా నేతలతో 2వ తేదీ భేటీ అవుతున్నారు. గట్టిగా చెప్పాలంటే టిటిడిపిలో ఉన్న నేతలెవరు ? అని వెతుక్కోవాల్సిన పరిస్ధితిలో ఉంది పార్టీ.

వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోగా ఉన్న వాళ్ళ సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. జిల్లాల్లో కానీ లేక నియోజకవర్గాల్లో గానీ బాగా పట్టుంది అనుకున్న నేతల్లో అత్యదికులు రేవంత్ తో కాంగ్రెస్ లో చేరిపోయారు. మిగిలింది ఒకరకంగా స్క్రాప్ మాత్రమే.

సీనియర్లు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, సండ్రవెంకట వీరయ్య, తెలంగాణా అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు మాత్రం మిగలారు. వీళ్ళల్లో ఏ ఒక్కరికీ ఇంకో నియోజకవర్గంలో మరొకరిని గెలిపించే శక్తి ఉందని ఎవరు అనుకోవటం లేదు.

మరి వీళ్ళని పెట్టుకుని చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి ? ఎందుకంటే, వీళ్ళల్లో అత్యధికులకు రేవంత్ ఎదుగుదల నచ్చలేదు. కేవలం ఈర్ష్యతోనే రేవంత్ టిడిపిని వదిలేసే పరిస్ధితులు కల్పించారన్నది బహిరంగ రహస్యం.  రేవంత్ తో పాటు వెళ్లిపోయిన వాళ్ళ జాబితా చూసిన తర్వాత చంద్రబాబు పై నేతలపై మండిపడినట్లు సమాచారం.

సరే, అయిన డ్యామేజి ఎటూ అయ్యింది కాబట్టి భవిష్యత్తులో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు నేతలతో సమావేశమవుతున్నారు. ఆరోజు ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !