
అమరావతి రైతులకు సింగపూర్ లో ఘన స్వాగతం లభించింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లో 123 మంది రైతులను ప్రభుత్వం సింగపూర్ కి తీసుకువెళ్లడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 34మంది రైతుల తొలి బృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.
ఈ రైతులకు సింగపూర్ విమానాశ్రయంలో సింగపూర్ తెదేపా ఫోరం ప్రతినిధులు జైరాం, చెన్నపాటి భానుచంద్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. నాలుగురోజులపాటు సింగపూర్‌లో వివిధ ప్రాంతాల్లో రైతులు పర్యటిస్తారు. 40 ఏళ్లలో సింగపూర్ అభివృద్ధి ఎలా సాధించిందో రైతులు పరిశీలిస్తారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ చెన్నకేశవరావు తదితరులు రైతులతో ఉన్నారు.