చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి ధ్వజం

Published : Oct 31, 2017, 03:14 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి ధ్వజం

సారాంశం

చంద్రబాబుపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ చంద్రబాబుకి తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డ లక్ష్మీ పార్వతి టీడీపీని కార్పొరేట్‌ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించిన లక్ష్మీ పార్వతి

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ చంద్రబాబుకి తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించొద్దంటూ సోమవారం నుంచి స్థానిక మహిళలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు విరుచుకుపడ్డారు.

కాగా, రెండో రోజైన మంగళవారం కూడా స్థానిక మహిళలు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరైన  లక్ష్మీ పార్వతి  ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ చెంచాలా పనిచేస్తోందన్నారు. మహిళలపై దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.  విశాఖలో భూకబ్జాలు, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ పార్టీని భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. కబ్జా రాజకీయాలు, రోడ్డుపై మానభంగాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని కార్పొరేట్‌ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు. అందాల పోటీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే మహిళలను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు విఫలయత్నం చేశారని గుర్తు చేశారు. ఈ దుష్ట సంస్కృతిని రాష్ట్రంలో ఎందుకు  ప్రవేశపడుతున్నారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu