(వీడియో) మోదీ మీద బట్టల వ్యాపారి వ్యంగ్య కవిత

First Published Jul 11, 2017, 3:15 PM IST
Highlights

మధ్య ప్రదేశ్ బురాన్ పూర్లో ఒక బట్టల వ్యాపారి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రం సంధించారు. బట్టల మీద జిఎస్ టి విధించి వ్యాపారాన్ని దెబ్బతీయ వద్దని ఆయన మోదీన తన వ్యంగ్యకవితలో కోరారు. వోటేసి నందుకు వేధిస్తావా అని ఆయన ప్రశ్నించారు. అయితే, దాదాపు ఆశువుగా  ఈ కవిత ని తోటి బట్టల వ్యాపారులందరికి వినిపించారు. బేష్సో అని  పించుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయి ఇపుడు ప్రపంచమంతా తిరుగుతూ ఉంది ఈ వీడియో.

 

మధ్య ప్రదేశ్ బురాన్ పూర్లో ఒక బట్టల వ్యాపారి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రం సంధించారు. బట్టల మీద జిఎస్ టి విధించి వ్యాపారాన్ని దెబ్బతీయ వద్దని గంగాధర్ చందక్ మోదీని తన వ్యంగ్య కవితలో కోరారు.వోటేసినందుకు వేదింపు ప్రతిఫలమా అని ఆయన అడుగుతున్నారు. అయితే, దాదాపు ఆశువుగా ఈ కవితని  తోటి బట్టల వ్యాపారులందరికి వినిపించారు.బేష్ అనిపించుకున్నారు. నిజానికి ఆయన జిఎస్టీ వ్యతిరేక బట్టల వ్యాపారుల సమావేశంలో పాల్గొని అపుడే బయటకు వచ్చారు. మోదీజీ కొద్దిగా దయచూపండి. ఇంత వేధింపు మంచిదికాదు. మేమంతా నీకు వోటేశాం. ఆ పాపానికి ఇలా  ఏడిపించడం మంచిది కాదు. ప్రియమైన మోదీ ఇంత వేధింపు మంచిది కాదు.

 

ఆయన వ్యంగ్యం చాలా శక్తివంతంగా ఉంది. గుచ్చుకునే లా ఉంది. చాలా సరళ పదాలతో చిన్న చిన్నవ్యాపారుల బాధలను చక్కగా వ్యక్తీకరించడంతో ఈ కవిత పఠనం వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది.  మీరే చూడండి. గంగాధరుని వ్యంగ్యాస్త్రం.

 

click me!