జండాకు శల్యూట్ చేయని నాగర్ కర్నూల్ కలెక్టర్

Published : Jun 03, 2017, 08:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
జండాకు శల్యూట్ చేయని నాగర్ కర్నూల్ కలెక్టర్

సారాంశం

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన పతాకావిష్కరణలో త్రివర్ణ పతాకకు శాల్యూట్‌ చేయకపోవడం అందరికంట  పడింది.  మెల్లిగా చర్చనీయాంశమైంది. శుక్రవారం నాడు రాష్ట్రవతర వేడుకల్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినపుడు జిల్లా ఎస్ పి,  ప్రజాప్రతినిధులు  జెండాకు శల్యూట్‌ చేస్తూ జాతీయగీతం ఆలపించారు.కలెక్టర్ మాత్రం అటెన్షన్ లో ఉండిపోయారు,ఎందుకు?

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన పతాకావిష్కరణలో త్రివర్ణ పతాకకు శాల్యూట్‌ చేయకపోవడం అందరికంట  పడింది.  మెల్లిగా చర్చనీయాంశమైంది. శుక్రవారం నాడు రాష్ట్రవతర వేడుకల్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అపుడు మంత్రితోపాటు జిల్లా పోలీసు సూరింటెండెటంట్ కల్మేశ్వర్‌ సింగెనవర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజులు జెండాకు శల్యూట్‌ చేస్తూ జాతీయగీతం ఆలపించారు.అయితే, ఇదే వేదికపై ఉన్న కలెక్టర్‌ మాత్రం శల్యూట్‌ చేయకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

 

ఇది మొదటిసారి కాదు.

 

గతంలో జనవరి 26 గణతంత్ర వేడుకల్లోనూ కలెక్టర్‌ ఇలాగే అటెన్షన్ లో నిలబడ్డారు.

 

శాల్యూట్ కచ్చతం గా చేయాలని లేదు

తన చర్యను కలెక్టర్ సమర్థించుకున్నారు. పతాకావిష్కరణ సమయంలో కచ్చితంగా శాల్యూట్ చేయనవసరం లేదని ఆయన చెప్పారు.


 

‘జాతీయజెండా అంటే నాకు గౌరవం. అయితే, పతాకావిష్కరణ సమయంలో శల్యూటే చేయాలన్న నిబంధనేమీ లేదు. అటెన్షన్‌లో నిలబడితే సరిపోతుంది,’ అని వివరణ ఇచ్చారు.ఈ విషయాన్ని తనకు శిక్షణ సమయంలో చెప్పారని, అదే పాటిస్తున్నానని  కలెక్టర్ తెలిపారు.

 

యూనిఫామ్‌లో ఉన్న పోలీస్‌ సిబ్బందికి, త్రివిధ దళాల్లోని వారికి సెల్యూట్‌ తప్పనిసరి అని, తమకు అవసరం లేదని అన్నారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !