మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ అరెస్టు

First Published Jun 8, 2017, 3:38 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. గిట్టుబాటు ధర కోసం ఇక్కడ రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయారు. దీంతో రాహుల్‌గాంధీ ఇక్కడ పర్యటించేందుకు  వచ్చారు. అయితే రాహుల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

గిట్టుబాటు ధరల కోసం ఉద్యమిస్తున్న రైతలును కలుసుకునేందుకు, పోలీసు కాల్పులలో మరణించివారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ పర్యటకు వచ్చారు.  అయితే, అక్కడ నిషేదాజ్ఞలు ఉల్లఘించేందుకు ప్రయత్నించారని చెబుతూ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.

ఆయన వెంబడి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, జనతాదళ్ యు నాయకుడు శరద్ యాదవ్ కూడా ఉన్నారు.

 

అక్కడ ఉన్న బారికేడ్ దూకి  వూర్లోకి  ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నపుడు పోలీసులు చట్టుముట్టి ఆయనను ఒక బస్ లోకి ఎక్కించి నీముచ్ గెస్ట్ హౌస్ కు తరలించారు.

 

గిట్టుబాటు ధర కోసం, రుణ మాపీ కోసం  ఈ ప్రాంత  రైతులు చాలా  రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పోలీసులు రైతుల మీద కాల్పులు జరిపారు. ఫలితంంగా ఐదుగురు రైతులు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు  రాహుల్‌గాంధీ ఈ ప్రాతంంలో  పర్యటించేందుకు గురువారం ఉదయం వచ్చారు. అయితే రాహుల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.  ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

click me!