విజయశాంతి ‘తెలంగాణా’ వదిలేసి చెన్నై పోతారా?

First Published Jun 8, 2017, 10:11 AM IST
Highlights

తెలంగాణాలో పాచిక పారకపోవడంతో  ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉంటున్న ‘రాములమ్మ’ విజయశాంతి అన్నాడీఎంకే వైపు చూస్తున్నట్లుంది. ఆమె శశివర్గంతో సాగిస్తున్న మంతనాలు చూస్తే ఎఐడిఎంకె వైపు మొగ్గు చూపుతున్నట్లనిపిస్తుంది. గతవారం లో ఆమె బెంగుళూరు జైలుకు వెళ్లి శశికళను పరామర్శించి వచ్చారు. నిన్నేమో చెన్నై వెళ్లి  అన్నాడీఎంకే డిప్యూటీ నేత టీటీవీ దినకరన్‌తో సమావేశం అయ్యారు. దీని భావమేమిటి?

తెలంగాణాలో పాచిక పారకపోవడంతో  ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉంటున్న ‘రాములమ్మ’ విజయశాంతి అన్నాడీఎంకే వైపు చూస్తున్నట్లుంది. ఆమె శశివర్గంతో సాగిస్తున్న మంతనాలు చూస్తే ఎఐడిఎంకె వైపు మొగ్గు చూపుతున్నట్లనిపిస్తుంది. గతవారం లో ఆమె బెంగుళూరు జైలుకు వెళ్లి శశికళను పరామర్శించి వచ్చారు. నిన్నేమో చెన్నై వెళ్లి  అన్నాడీఎంకే డిప్యూటీ నేత టీటీవీ దినకరన్‌తో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలతో తాను కలవాల్సిన ఉన్న  విజయశాంతికి  ప్రాముఖ్యం ఇచ్చి,  స్వాగతించారు. చాలా సేపు మాట్లాడారు.

పార్టీ వ్యవహారాలను దినకరన్‌ చక్కదిద్దగలరన్న నమ్మకం తనకుందని ఎమ్మెల్యేలతో విజయశాంతి సమావేశం తర్వాత వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

 

విజయశాంతి రాజకీయమేమిటో అర్థంకావడం లేదు. తెలంగాణా పేరుతో పార్టీ పెట్టారు. టీఆర్ ఎస్ లో చేరారు. ఒక దఫా ఎంపి అయ్యారు. ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. 2014 ఫిబ్రవరి కాంగ్రెస్ లో చేరారు. అయితే, చేరిన రోజు ఢిలీ కాంగ్రెస్ నేతలతో ఫోటో (పైన) దిగడం తప్ప ఆమె కాంగ్రెస్ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించలేదు. మొన్న రాహుల్ గాంధీ వచ్చినపుడు కూడా ఆమె  కనిపించలేదు. తెలంగాణా పార్టీ ఫెయిలంది. టిఆర్ ఎస్ లో ఉండ లేకపోయింది. కాంగ్రెస్ లో కూడా వెలుగులోకి రాలేకపోయింది.  తెలంగాణా రాజకీయాలలో పైకి వచ్చేందుకు తాను తెలంగాణా బిడ్డ అని చాలా కష్టపడి రుజువు చేసుకున్నారు. అయితే, ఈ ప్రాంతంలో ఇపుడు గాని, ఇపుడు గాని ఎవరూ సీరియస్ గా లేదు.

అందుకని ఆమె తమిళరాజకీయాలవైపు వెళ్లాలనుకుంటున్నారా?

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా పళని స్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించారు. అంతేకాాదు, ఇంకా చాలా ముందుకు వెళ్లి పన్నీర్ సెల్వాన్ని ‘దుష్ట శక్తి’ అని వర్ణించారు.చిన్నమ్మ‘శశికళ’ తమిళనాడును కాపాడే శక్తి అని కూడ వర్ణించారు.

లేక, ఏదైనా జాతీయ పార్టీ ఆమె ద్వారా శశికళ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా?

 

 

 

 

click me!