పెయిడ్ న్యూస్ కేసులో మధ్య ప్రదేశ్ మంత్రిపై అనర్హత వేటు

First Published Jun 24, 2017, 11:56 AM IST
Highlights

ఎన్నికల వ్యయం గురించి తప్పుడు సమాచారం అందిస్తే ఏమవుతుందో చూడండి. ఇలాంటి ఆరోపణ మీద మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నరోత్తమ్‌ మిశ్రాపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈ అనర్హత మూడేళ్ల పాటు ఉంటుంది. పెయిడ్ న్యూస్ ఖర్చుపై ఎన్నికల ఖర్చు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనేది ఆయన మీద ఆరోపణ.

ఎన్నికల కమిషన్ కు ఎన్నికల వ్యయం గురించి తప్పుడు సమాచారం అందిస్తే ఏమవుతుందో చూడండి...

 ఇలాంటి ఆరోపణ మీద మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నరోత్తమ్‌ మిశ్రాపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈ అనర్హత మూడేళ్ల పాటు ఉంటుంది.

ఎన్నికల ఖర్చు పై అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనేది ఆయన మీద ఆరోపణ.

2008 ఎన్నికలలో ఆయన తనకు అనుకూలంగా డబ్బులిచ్చి వార్తలు రాయించుకున్నాడని కమిషన్ కు పిర్యాదు అందంది. ఎన్నికల్లో గెలిచాక ఆయన ఆరోగ్యశాఖ  మంత్రి అయ్యారు. మిశ్రా దాతియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర భార్తి ఆయన మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అయితే, ఈ విచారణ మీద స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని , ఎన్నికల కమిషన్ విచారించడానికి వీల్లేదని ఆయన కమిషన్ లో పిటిషన్ వేశారు. 2015లో ఎన్నికల కమిషన్ ఈ పిటిషన్ ను కొట్టేవేసింది. 2008 నవంబర్ 8-27 మధ్య వివిధ పత్రికల 42 వార్తలు వచ్చాయని, అవన్నీ పెయిడ్ న్యూస్ అన్నఫిర్యాదు కమిషన్ విచారణలో నిజమని తేలింది.

ఈవార్తలకు చెల్లించిన డబ్బు ఎన్నికల ఖర్చు అఫిడవిట్‌లో చూపలేదని ఈసీ నిర్ధారించింది. అందువల్ల మంత్రిపై మూడేళ్లపాటు అనర్హత ప్రకటిస్తూ కమిషన్ ఉత్తర్వులిచ్చింది.

 

 

 

 

 

click me!