హిందూపురంలో బుల్లెట్ మీద బాలయ్య సందడి

Published : Jun 24, 2017, 11:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
హిందూపురంలో బుల్లెట్ మీద  బాలయ్య సందడి

సారాంశం

మొత్తానికి నందమూరి బాలకృష్ణ హిందూపురం వచ్చారు. బుల్లెట్‌ నడుపుతూ హిందూపురంలో టిడిపి ఎమ్మెల్యే సందడి చేశారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన ఈలలేశారు.నినాదాలు ఇచ్చారు.అనేక అవాంఛనీయ పరిణమాల అనంతరం, విమర్శల తర్వాత... దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన నియోజకవర్గానికి వచ్చారు.

మొత్తానికి నందమూరి బాలకృష్ణ హిందూపురం వచ్చారు. బుల్లెట్‌ నడుపుతూ హిందూపురంలో సందడి చేశాడు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన ఈలలేశారు.స్లోగన్లు ఇచ్చారు.

అనేక అవాంఛనీయ పరిణమాల అనంతరం, విమర్శల తర్వాత, దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన నియోజకవర్గానికి వచ్చారు. ఇది  తెలుగుదేశం శ్రేణుల్లోమళ్లీ ఉత్సాహం నింపింది. బాలయ్యరాక  సందర్భంగా తెలుగుదేశం పార్టీ బైక్ ర్యాలీ ఏర్పాటుచేసింది. ఆయన బుల్లెట్ ఎక్కింది ఈ ర్యాలీలో భాగంగానే. తర్వాత వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

 రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టిన మాతా-శిశు వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంత్రి సునీత మాట్లాడుతూ బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బాలయ్య సేవలను కొనియాడారు.  

 

తానెక్కడున్నా హిందూపురం బాగోగుల కోసమే ఆలోచిస్తూ ఉంటానని బాలయ్య భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు త్వరలోనే హంద్రీనీవా నీటిని తీసుకొస్తానని హామీ చ్చారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !