
తమ అభిమాన నేతను ప్రశ్నించే ఏ గొంతునైనా నొక్కేసేందుకు మోదీ భక్తులు వెనకాడటం లేదు. దీనికి ఉదాహరణే ఈ సంఘటన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ట్విటర్ లో పోస్టు
ఇటీవల ఖాదీ గ్రామీణ ఉద్యోగ్ మిషన్ సంస్థ కు సంబంధించిన కేలండర్లలో గాంధీ ఫొటో కు బదులుగా మోదీ ఫొటో ప్రచురితమైన విషయం తెలిసిందే.
70 ఏళ్లుగా చరాఖాతో ఉన్న గాంధీ ఫోటోతోనే ఖాదీ మిషన్ కేలండర్ లు ప్రచురిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది గాంధీ స్థానంలో మోదీ చరాఖాతో ఉన్న ఫొటోను తీసుకొచ్చారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. సంస్థ ఉద్యోగులే ఈ సంఘటనను నిరసిస్తూ ఆందోళన కూడా చేపట్టారు.
ఈ విషయంపైనే ఓ జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కుమార్ ట్వీట్ చేశాడు. ‘మనకు ఇప్పడో కొత్త గాంధీ దొరికాడు... ఇక కొత్త గాడ్సే ఎప్పుడొస్తాడో‘ అని ట్వీటాడు. ఇది మోదీ భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే అతడిపై ట్విటర్లో దాడికి దిగారు.
పాపం సదరు జర్నలిస్టు.. ‘అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే... చానెల్ కు నా ట్వీట్ కు సంబంధం లేదని’ వివరణ ఇచ్చినా ఊరుకోలేదు. వారి ట్వీట్ దాడులు భరించలేక చివరకు అతడు తన ట్వీట్ పై అందరికీ క్షమాపణలు చెప్పాడు.