తూచ్..తూచ్.. పెద్ద నోట్లుంటే జైలుకేం వద్దులే

Published : Dec 29, 2016, 04:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
తూచ్..తూచ్.. పెద్ద నోట్లుంటే జైలుకేం వద్దులే

సారాంశం

ఆర్డినెన్స్ పై వెనక్కు తగ్గిన కేంద్రం

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం పూటకోమాట మారుస్తోంది. రోజుకో కొత్త రూలు తీసుకొస్తూ తుగ్లక్ పాలనను తలపిస్తుంది.

 

రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు ఇక పై ఎవరిదగ్గర ఉన్నా నేరంగానే భావిస్తామని చెప్పిన  కేంద్రం చట్టరిత్యా శిక్షించేందుకు ఆర్డినెన్స్ కూడా సిద్ధం చేసింది.

 

ఆ ఆర్డినెన్స్‌ పై కొద్దిసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేయడానికి ముందే మళ్లీ వెనక్కు తగ్గింది.

 

ఆర్డినెన్స్‌లో కీలక సవరణ కొన్ని చేసినట్లు సమాచారం.

రద్దయిన నోట్లు కల్గిఉంటే జైలు శిక్ష విధింపు అనే నిబంధన తొలగించారు. మరికొన్ని సవరణలు కూడా చేయనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ డిసెంబర్ 31 నుంచి అమలులోకి వస్తుంది. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !