ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మగాంధీ మనవడు

First Published Jul 11, 2017, 1:35 PM IST
Highlights

ఉప రాష్ట్రపతి ఎన్నికలలో కూడా పోటీ పెట్టాలని ప్రతి పక్షాలు నిర్ణయించాయి. తమ అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాయి.  ఈ రోజు పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో గోపాల కృష్ణగాంధీ పేరును ఈ పార్టీల నాయకులు ఖరారు చేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలలో కూడాపోటీ పెట్టాలని ప్రతి పక్షాలునిర్ణయించాయి.

 

తమ అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాయి.  ఈ రోజు పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో గోపాల కృష్ణగాంధీ పేరును ఈపార్టీల నాయకులు ఖరారు చేశారు.

 

సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించారు. మొత్తం  18 పార్టీల నేతలు సమావేశానికి హజరయ్యారు. గోపాలకృష్ణ గాంధీ యుపిఎ ప్రభుత్వ హయాంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ పనిచేశారు. సమావేశం అనంతరం సోనియా గాంధీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. సమావేశంలో ఒక్క గాంధీ పేరు మాత్రమే చర్చకు వచ్చిందని ఆమె చెప్పారు.

ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

click me!