నవంబర్ లో మెట్రో పరుగులు

First Published Aug 14, 2017, 12:55 PM IST
Highlights
  • మియాపూర్ నుంచి నాగోల్ కి మెట్రో రూట్ నవంబర్ లో ప్రారంభించనున్నారు
  • ఈ మెట్రో సర్వీసును ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నానరట

హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త.. ఎంతోకాలం నుంచి నగరవాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైలు.. త్వరలో ప్రారంభం కానుంది. మియాపూర్ నుంచి నాగోల్ కి మెట్రో రూట్ నవంబర్ లో ప్రారంభించనున్నారు.  ఈ విషయాన్ని సంబంధిత అధికారులు అధికారంగా ప్రకటించారు. నవంబర్ లోపు ఈ సర్వీసును పూర్తి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు  మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు ఒక కారిడార్, అమీర్ పేట నుంచి నాగోల్ కి రెండో కారిడార్ ను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెప్పారు. రెండు కారిడార్లు కలిపి మొత్తం 30కిలోమీటర్లు ఉంటుంది.

ఈ మెట్రో సర్వీసును ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నానరట. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం కూడా పంపినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు కారిడార్ల సమన్వయ పనులు జరుగుతున్నాయి.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ సర్వీసును పూర్తి చేయడానికి 800 మంది ఇంజినీర్లు, వర్కర్లు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఇది కనుక ప్రారంభమైతే.. అమీర్ పేట మెట్రో స్టేషన్ భారత్ లోనే అతిపెద్ద మెట్రో స్టేషన్ కానుంది.

click me!