బుద్వేల్ లో ఐటీ పార్క్..!

First Published Aug 14, 2017, 12:21 PM IST
Highlights
  • బుద్వేల్ లో కూడా ఓ ఐటీ పార్క్ రానుంది
  • 350 ఎకరాలలో దీని నిర్మాణం చేపట్టనున్నారు.

 

ఇప్పటి వరకు మాదాపూర్, గచ్చిబౌలిలోనే ఐటీ హబ్స్ ఉన్నాయి. కాగా.. త్వరలో బుద్వేల్ లో కూడా ఓ ఐటీ పార్క్ రానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే సంవత్సరంలో దీని ఏర్పాటు ప్రారంభించే అవకాశం ఉంది. 350 ఎకరాలలో దీని నిర్మాణం చేపట్టనున్నారు.

భూమి కేటాయింపు పనులు పూర్తి అయిన వెంటనే.. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ( టీఎస్ఐఐసీ) సహాయంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు పార్క్ లో రోడ్ల ఏర్పాటు వంటివి మొదలుపెడతారని సంబంధిత అధికారులు తెలిపారు.ఈ ఐటీ పార్క్ నిర్మాణానికి భూమి సేకరణను  టీఎస్ఐఐసీ ఇప్పటికే మొదలుపెట్టిందట.ఈ పార్క్ లో పది ప్రముఖ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. అందులో తమ కంపెనీ నిర్మాణానికి భూమి కావాలంటూ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారట.

బుద్వేల్ సిటీ అవుట్ స్కట్స్ లోని 350 ఎకరాలలో ఐటీ పార్క్ నిర్మాణం చేపట్టామని ఐటీ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. ఇందులో 8 ఎకరాలు లిటిగేషన్ ఉన్నాయని.. మిగిలిన భూమంతా ఐటీ పార్క్ నిర్మాణానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఆ ఎనిమిది ఎకరాల సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు.

బద్వేల్ లోని రాజేంద్ర నగర్ ని ఐటీ పార్క్ నిర్మాణానికి ఎంచుకున్నట్ల సమాచారం ఎందుకంటే ఈ ప్రాంతం విమానాశ్రయానికి, అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. అందుకే అక్కడ నిర్మిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

click me!