అమలాపురం మిస్టరీ : కొనసాగుతున్న కార్ల ధ్వంసం

First Published May 6, 2017, 11:29 AM IST
Highlights

ఎవరో రాత్రి పూట కార్లమీద కసితీర్చుకుంటున్నారు. గత నెల 29వ తేదీ అర్థరాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకూ తొమ్మిది కార్ల ధ్వంసం అయ్యాయి. దీని వెనక నలుగురు  బాలురున్నారని అనుమానించి, వారిని శుక్రవారం వారిని అరెస్టు చేసి రాజమండ్రికి  తరలించారు. వారిని విచారించామని, ఈ విధ్వంసకాండ వెనక బాగా పలుకుబడిఉన్న నాయకుడున్నాడని, ఆయన పేరు చెబితే తమకు ప్రాణహాని ఉంటుందని వారు భయపడుతున్నారని సిఐ చెప్పారు.

అంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఉన్నట్లుండి గత కొద్ద రోజులుగా కార్లు ధ్వంసమవుతున్నయి.

 

ఎవరో రాత్రి కార్లమీద కసితీర్చుకుంటున్నారు. గత నెల 29వ తేదీ అర్థరాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకూ తొమ్మిది కార్ల ధ్వంసం అయ్యాయి. దీని వెనక నలుగురు  బాలురున్నారని  అమలాపురం పట్టణ సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌ అనుమానిస్తూ వచ్చారు. మొత్తానికి వారిని శుక్రవారం వారిని అరెస్టు చేసి రాజమండ్రికి  తరలించారు. వారిని విచారించామని, ఈ విధ్వంసకాండ వెనక బాగా పలుకుబడిఉన్న నాయకుడున్నాడని, ఆయన పేరు చెబితే తమకు ప్రాణహాని ఉంటుందని వారు భయపడుతున్నారని సీఐ చెప్పారు.

 

వారిని అరెస్టు చేశాక కూడా కార్ల ధ్వంసం ఆగలేదు. శుక్రవారం మరో నాలుగు కార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.పట్టణంలో కొనసాగుతున్న ఈ విధ్వంసం కారువోనర్లను ఆందోళనకు గురిచేస్తూఉంది. ఈ కార్లమీద దాడులేమిటని పోలీసులుఅనేక  కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాటి వెనుకనున్న ఆ వ్యక్తి ఎవరో, ఆయనకు కార్లమీద కోపమేమిటని గింజుకుంటున్నారు.

 

ఒక వాదన ప్రకారం, బాహుబలి2 బెనిఫిట్ షో రోజున మొదలయిన వివాదం ఫలితమే ఇదంతా. ఈ వివాదానికి కారణమయిన వారే దీని  వెనకవుంటారని, అరెస్టయి బాలురు చెబుతున్న పెద్ద మనిషి కూడా  ఇందులో మనిషేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ఈ ధ్వంసంపై జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ రాజకుమారి రాత్రి పట్టణంలో ఒక రౌండు గస్తీ తిరిగారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి  కార్ల ధ్వంసం గుట్టు విప్పుతామని ఆమె పట్టణవాసులకు భరోసా ఇస్తున్నారు.

 

 

 

click me!