టెన్త్ లో తూర్పు గోదావరి టాప్, చిత్తూరు అట్టడుగున

First Published May 6, 2017, 10:50 AM IST
Highlights
  • ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి.
  • తూర్పుగోదావరిజిల్లా  అగ్రస్థానంలో నిలబడితే, చిత్తూరు జిల్లా అట్టడుగున పడిపోయింది. 
  • ఈ మధ్యాహ్నం హెచ్ ఆర్ డి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఫలితాలను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి.

తూర్పుగోదావరిజిల్లా  అగ్రస్థానంలో నిలబడితే, చిత్తూరు జిల్లా అట్టడుగున పడిపోయింది. 

ఈ మధ్యాహ్నం హెచ్ ఆర్ డి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఫలితాలను విడుదల చేశారు.

 

  ఈ ఏడాది మార్చిలో ఈ పరీక్షలకు మొత్తం 6,22,538మంది హాజరయ్యారు.

 

 వారిలో 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఉత్తీర్ణులయిన 91.92 శాతంలో బాలురు 91.87మంది, బాలికలు 91.97 శాతం ఉన్నారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 97.97 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది.  80.55 శాతంతో చిత్తూరు జిల్లా చివర నిలబడింది. ఉత్తీర్ణత  గతేడాది కన్నా 2.60 శాతం తగ్గినట్లు మంత్రి తెలిపారు. 4,102 పాఠశాలలు వంద శాతం ఫలితాలు

సాధిస్తే , రెండు ప్రయివేట్‌ స్కూళ్లు జీరో శాతం లో ఉన్నాయని చెప్పారు.

click me!