బలవంతంగా వద్దు, ముద్దుకు పది వేల ఫైన్ అక్కడ

First Published May 6, 2017, 10:13 AM IST
Highlights

బలవంతంగా రెండు ముద్దులు పెట్టి ఇరుక్కుపోయాడొక బీహార్ పిల్లోడు. వూరేమో ముద్దుకు ఇరవై వేలు జరిమానా అంటున్నది. ఇంత జరిగాక,ఫైనెందుకు, తన్ను పెళ్లిచేసుకోవలిందే అంటాంది బీహారీ పిల్ల.

బలవంతంగా రెండు సార్లు ముద్దుపెట్టుకున్నందున బీహార్ లోని ఒక గ్రామపంచాయతీ ఒక కుర్రవాడికి రు. 20 వేల జరిమాన విధించింది.

 

అవును రెండు ముద్దులకు 20 వేలు. ముద్దుకు పది వేలు.

 

ఈ గ్రామంలో అమ్మాయినెవరయిన బలవంతంగా ముద్దు పెట్టుకుంటే  పదివేల రుపాయల జరిమాన విధించాలనేది నియమం. ఈ సారి ఆగంతకుడు రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి  ఇరవైలు జరిమాన కట్టాల్సిందేనని గ్రామస్థులు ఖరాకండిగా చెప్పేశారు.

 

అయితే, ఇక్కడ పంచాయతీకి పెద్ద సమస్యొచ్చిపడింది. జరిమానా గిరిమానా జాన్తానై. ముద్దుపెట్టుకున్నోడు నన్ను పెళ్లిచేసుకోవలసిందే నంటోంది బాధితురాలు.

 

 ఈ ముద్దు సంఘటన బీహార్ , బేగుసరాయ్ జిల్లాలోని మఖాచక్ గ్రామంలోజరిగింది. ఈ సంఘటన జరిగి పదిహేనులవుతున్నా, గ్రామపంచాయతీ ముందుకు మే 2 తేదీన వచ్చింది.

 

అయితే, బాధితురాలు  తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తేన్నది. ఇంత జరిగాక, నిందితుడు , మహ్మద్ ఇర్షాద్ (22)తనని పెళ్లిచేసుకోకపోతేకుదరదు,అని మొండికేస్తున్నది. ఇది రచ్చయ్యాక నన్నెవరు పెళ్లిచేసుకుంటారన్నది ఆమె ఆవేదన. ఇద్దరు ఒకే కులం కాబట్టి పెళ్లిచేసుకుంటే పోలా అని ఆమె వాదిస్తున్నది.

 

అయితే, లోకల్ పోలీసు లు మాత్రం ఈ గొడవను సీరియస్ తీసుకోవడం లేదు. వాళ్లిద్దరిమధ్య వ్యవహారం ఎప్పటినుంచోనడుస్తూ ఉందని, వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని వారంటున్నారు.

 

అందుకే కేసేమీ బుక్ చేయలేదు.

 

‘గ్రామ మసీదు వద్ద రు. 20 వేలు డిపాజిజట్ చేయాలని పంచాయతీ ఆ కుర్రవాడిని అడిగినట్టు మాకు సమాచారం అందింది.  అయితే, దీనిమీద ఇంతవరకు ఎలాంటి పిర్యాదు మాకు అందలేదు. మేం కేసెలా బుక్ చేస్తాం. నిజానికి వాళ్లిద్దరి వ్యవహారం నడుస్తూ ఉంది,’ అని సబ్ ఇన్స్ పెక్టర్ సునీల్ కుమార్ హిందూస్తాన్ టైమ్స్ ప్రతినిధికి చెప్పారు.

 

అయితే, అమ్మాయిలను సతాయించిన కేసొకటి ఇప్పటికే ఇర్షాద్ మీద పెండింగులోఉందని కూడా ఆయన చెప్పారు.

click me!