జనవరిలో ఎంజీ మోటార్స్ విద్యుత్ వెహికల్ ఆవిష్కరణ

By narsimha lodeFirst Published Sep 12, 2019, 2:45 PM IST
Highlights

పెట్రోల్, డీజీల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న సమయంలో విద్యుత్ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గుచూపతుున్నారు. ఎంజీ మోటార్స్  విద్యుత్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

హైదరాబాద్: ఎంజీ మోటార్స్ ఇండియా వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లోకి విద్యుత్ కార్ల తయారీ విభాగంలో తన తొలి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ).. జడ్ఎస్ఈవీని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 350 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఎంజీ మోటార్స్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా చెప్పారు. 

వచ్చే 18 నెలల్లో మరో రెండు మోడల్ కార్లను భారత విపణిలో ప్రవేశపెడతామని ఎంజీ మోటార్స్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా చెప్పారు. దేశంలో రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 

ప్రస్తుతం ప్లాంట్‌లో ఏటా 80 వేల కార్ల తయారీ సామర్థం ఉన్నదని ఎంజీ మోటార్స్ ఇండియా సీఎఫ్ఓ గౌరవ్ గుప్తా చెప్పారు. ఇప్పటివరకు ఎంజీ హెక్టార్ కోసం 28 వేల బుకింగ్స్ నమోదయ్యాయన్నారు. జూలైలో 1508, ఆగస్టులో 2108 కార్లను వినియోగదారులకు అందజేశామని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ఉత్పాదక యూనిట్‌లో 3000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 

త్వరలో ఎస్ యూవీ హెక్టార్ బుకింగ్స్ ప్రారంభిస్తామని ఎంజీ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా చెప్పారు. త్వరలో గుజరాత్ ప్లాంట్లో ఉత్పాదక సామర్థ్యాన్ని స్థిరీకరిస్తామన్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో హెక్టార్ బుకింగ్స్  పున: ప్రారంభించే అవకాశం ఉండొచ్చునన్నారు. 

click me!