
‘అమ్మ’ అభిమానులు వినూత్న రీతిలో నివాళులర్పించారు. జయలలిత సమాధి ఉన్న మెరీనా బీచ్ వద్ద 68 కిలోల ఇడ్లీని తయారు చేసిన అభిమానులు దానిపై అమ్మ చిత్రం వచ్చేలా రూపొందించారు.
అమ్మ క్యాంటీన్ల ద్వారా చెన్నైలో అతి తక్కువ ధర ఇడ్లీ అందిస్తున్నందుకు గుర్తుగా ఈ ప్రయత్నం చేసినట్లు అమ్మ అభిమానులు తెలిపారు.