ఈ విషయంలో ఆడపిల్లలే నయం

Published : Aug 08, 2017, 11:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఈ విషయంలో ఆడపిల్లలే నయం

సారాంశం

టీవీ షోస్, ఇంటర్నెట్ ని ఎక్కువగా చూస్తే.. మానిసక సమస్యలు తలెత్తే  ప్రమాదం నిద్రలేమి, కమ్యునికేషన్ స్కిల్స్ తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు

 

ప్రస్తుత కాలంలో టీవీలు, ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా గడిపేవాళ్లు ఎవరుంటారు చెప్పండి. టీవీ, ఇంటర్నెట్ నుంచి ప్రస్తుత యువత చాలానే నేర్చుకుంటోంది. కాస్త బోర్ కొట్టినా.. టీవేనే చాలా మంది కాలక్షేపం. కానీ మితిమీరితే ఏదైనా ప్రమాదమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. టీవీ, ఇంటర్నెట్ వంటివి అవసరానికి చూస్తే పర్లేదు. అదే మితిమీరి అదేపనిగా చూస్తే మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు. మానసిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ షోస్, ఇంటర్నెట్ ని ఎక్కువగా చూస్తే.. మానిసక సమస్యలు తలెత్తే  ప్రమాదం ఉందట.

అదేపనిగా టీవీ చూసే వారిలో డిప్రెషన్ ఎక్కువగా పెరిగిపోతుందట. అంతేకాదు.. నిద్రలేమి, కమ్యునికేషన్ స్కిల్స్ తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా యువతలోనే తలెత్తే ప్రమాదం ఉందని వారు  చెబుతున్నారు.

ఒక రోజులో ఆరు నుంచి ఏడుగంటలు, సోషల్ మీడియా వెబ్ సైట్లు, యూట్యూబ్ లాంటివి చూడటం అలవాటు అయినవాళ్లు.. కొంతకాలం తర్వాత అవి చూడటం మానేయాలనుకున్నా మానేయలేరట. అందుకు వారి శరీరం, మెదడు అంగీకరించదని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ చెప్పారు.

తమ పిల్లలు మానసిన వ్యాధితో బాధపడుతున్నారంటూ.. 16 నుంచి 20ఏళ్ల వయసు పిల్లలను వారి తల్లిదండ్రులు తరచూ ఆస్పత్రులకు తీసుకువస్తున్నారని డాక్టర్ మనోజ్ శర్మ తెలిపారు. వారంలో ఇలాంటి కేసులు  4 నుంచి 5 తమకు దగ్గరకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆడపిల్లలతో పోలిస్తే.. మగపిల్లలే ఎక్కువగా  ఇంటర్నెట్, టీవీలకు బానిసలుగా మారుతున్నారట.  బోర్ కొట్టినప్పుడు చూడటంతో మొదలైన ఈ అలవాటు.. కాలక్రమేన వ్యసనంగా మారుతుందని ఆయన చెబుతున్నారు.

దాదాపు ఇప్పుడు అందరి ఇళ్లలో వైఫై అందుబాటులో ఉంటోంది. దీంతో పిల్లలు దానికి బానిసలౌతున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులే  ఈవిషయంలో జాగ్రత్త తీసుకోవాలని.. వారి చదువు, కెరియర్ గురించి శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !