కరీంనగర్ లో పొన్నం ఆమరణ దీక్ష భగ్నం

First Published Aug 8, 2017, 9:01 AM IST
Highlights

మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్మం ప్రభాకర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసుల భగ్నం చేశారు.కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత మూడు రోజులుగా పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న ఆమరణ దీక్షకు దిగారు.

 

మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్మం ప్రభాకర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసుల భగ్నం చేశారు.కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత మూడు రోజులుగా పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న ఆమరణ దీక్షకు దిగారు. పొన్నం దీక్షను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితం చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం, పొన్నం ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో  పోలీసులు మంగళవారం ఉదయం దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి, పోలీసుల వ్యాన్ లోకి ఎక్కింది కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 పొన్నం ఆరోగ్యం క్షీణిస్తున్నదని , దీక్ష విరమించకుంటే మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపే చప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిని అదునుగా తీసుకుని  పోలీసులను రంగంలోకి దిగారు. దింపి దీక్షను అడ్డుకున్నారు.

పొన్నం దీక్షను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసే వరకు దీక్షను విరమించేదే లేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తానని పొన్నం ప్రభాకర్‌ అంటున్నారు.

 

 

click me!