(వీడియో) మావో గణపతి మా గణపతి ఏమన్నాడయ్యా...?

First Published Feb 1, 2017, 9:57 AM IST
Highlights

మతపిచ్చితో ప్రవర్తించే అఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు రాజ్యహింసకు వ్యతిరేకంగా సైద్దాంతికంగా పోరాడే భారత మావోలకు తేడా లేకుండా పోయిందా... ?

తాడిత పీడిత ప్రజల కోసం అడవుల్లో పోరాడే అన్నలకు ఏమైంది... రాజ్యహింసకు వ్యతిరేకంగా పేల్చాల్సిన తూటాలను హిందువుల మనోభావాలపై ఎందుకు గురిపెడుతున్నారు. సిద్దాంతం సైడ్ ట్రాక్ లోకి వెళుతుందా లేకుంటా ఆత్మరక్షణ కోసం అడ్డదారులు తొక్కుతున్నారా...

 

ఇటీవల మావోయిస్టుల కంచుకోట బస్తర్ లో ఓ అతి పురాతన గణేషుడి విగ్రహం ధ్వంసమైంది. దంతెవాడ జిల్లాలోని ధోల్కల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ  కొండపై 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గణేషుడి విగ్రహం కొలువుదీరింది. ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో జనం పోటెత్తుతున్నారు.

 

పురతాత్వ శాఖ కూడా ఆ విగ్రహాన్ని గుర్తించి ప్రత్యేకంగా సర్వే చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టూరిస్టు స్పాట్ గా మార్చేందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టింది.

 

అయితే ఈ చర్య వల్ల తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతోందని భావించిన మావోలు ఆలస్యం చేయకుండా ఆ పురాతన విగ్రహాన్ని 56 ముక్కలు చేశారు. కొండ దిగువ ప్రాంతంలో తునాతునకలుగా మారిన విగ్రహ శకలాలు లభ్యమయ్యాయి.

 

అయితే మావోలు చేసిన ఈ ఘాతుకంపై హిందూ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అఫ్ఘనిస్తాన్ లో బుద్దుడి విగ్రహాలను ధ్వంసం చేసిన తాలిబన్లతో మన దేశంలో మావోయిస్టులను వారు పోల్చుతూ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

click me!