జైట్లీకి మహాత్ముడి శరణం

Published : Feb 01, 2017, 07:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
జైట్లీకి  మహాత్ముడి శరణం

సారాంశం

బడ్జెట్ ప్రసంగంలో మహాత్ముడి ప్రవచనం  -ఆదాయపు పన్ను మినహాయింపులో నిరాశే...

 మహాత్మ గాంధీ ప్రాముఖ్యం తగ్గిస్తున్నారని మోదీ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  గాంధీ శరణుజొచ్చారు.

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ మహాత్మా గాంధీ మాటలను ప్రస్తావించి నోట్ల రద్దు మంచి నిర్ణయం అని సమర్థించుకున్నారు. ‘మంచి పని ఎప్పటికీ విఫలం కాదు’ అని గాంధీ అన్నారని అంటూ నల్లధనం నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంచివని , మంచిఫలితాలుంటాయని అన్నారు.

***

 ఆదాయపు పన్ను మినహాయింపులో నిరాశే...

మధ్య తరగతి జీవులు ఏవేవో వూహించుకున్న ఆదాయపు పన్ను ఆశలు వమ్మయ్యాయి. ఇందులో పెద్దగా మినహాయింపులు లేవు. భారత్ పన్ను ఎగ్గొట్టే దేశం అని దీనికి వివరణ ఇచ్చుకున్నారు. అందుకే రు. 5 లక్షల పైబడి  ఆదాయం వున్నవారిమీద ఆయన ఎలాంటి దయచూపలేదు.

నిజాయతీపరులపై భారం  తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు.  ఇది సామాన్యుడికి గొప్ప ఊరట చెప్పారు.  రూ.3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం పడదు.

***

బ్రిటిష్‌ వలస కాలం నుంచి వస్తున్న ఒక  బడ్జెట్‌ సంప్రదాయానికి అరుణ్‌జైట్లీ  ముగింపు. 92 ఏళ్లుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది.  తొలిసారి ఈ బడ్జెట్‌లో సాధారణ బడ్జెట్ కలిపేశారు.   ‘స్వాతంత్య్రం వచ్చాక, తొలిసారిగా రైల్వేప్రతిపాదనలు కూడా ఉన్న  సాధారణ బడ్జెట్ ను  ప్రవేశపెడుతున్నాను. ఇది  నాకు లభించిన విశేష గౌరవం’ అని అరుణ్‌జైట్లీ అన్నారు.

***

అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రతిపాదనలు పలు సందర్భాలలో అధికార పక్షం సభ్యల ప్రశంసలందుకున్నారు. వారు బల్లులు చరస్తూ, ఆహా ఓహో అంటూ  హర్షం వ్యక్తం  చేస్తూ వచ్చారు. ఎన్ డి ఎ హాయంలో  గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని  జైట్లీ వివరిస్తున్నపుడుె   ప్రధాని నరేంద్ర మోదీ బల్లపై చేతులతో చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు.

***

విరాళాల మీద కట్టడి విధించి రాజకీయ పార్టీలకు బడ్జెట్ లో  షాకిచ్చారు. ఒక వ్యక్తి నుంచి లేదా సంస్థ నుంచి  పార్టీలు కేవలం 2000 రూపాయల  మాత్రమే నగదు రూపేణా విరాళాలు స్వీకరించాలి.  కావాలంటే చెక్కులు లేదా ఆన్‌లైన్ లేదా డిజిటల్ రూపంలో  భారీ విరాళాలు సర్ధవచ్చు. వీటికి  నిర్ణీత గడువులోపు  ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ కచ్చితంగా దాఖలు చేయాలి.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !