
చిన్నమ్మ సీఎం పీఠం ఎక్కకముందే ఆమె వీర విధేయులు వీరంగం సృష్టించారు. పన్నీరు పీఠం దిగగానే చిన్నమ్మకు చెందిన ముఖ్య నేతలు కొందరు అన్నా డీఎంకే కార్యకర్తను చితకబాదారు.
ఈ రోజు పోయిస్ గార్డెన్ లో పార్టీ నేతల సమావేశం ముగిసిన తర్వాత కొందరు నేతలు... శశికళ పోస్టరును చించుతున్న పార్టీ కార్యకర్తను పట్టుకున్నారు. పోలీసులు చూస్తుండగానే అతడిపై తమ ప్రతాపం చూపారు.
తమ పార్టీ కార్యకర్త అన్నా కనికరం కూడా చూపకుండా పోలీసుల ముందే దాడికి దిగారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దాడిని చిత్రీకరించారు.