
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు రక్షణే కరవవుతోంది. బయట నుంచే కాదు వర్సిటీ సిబ్బంది, విద్యార్థుల నుంచే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. మనదేశంలోని అన్ని వర్సిటీలలో ఇదే పరిస్థితి. ఇలాంటప్పుడు వర్సిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీసీలపైనే ఉంటుంది.
కానీ, మైసూర్ యూనివర్సిటీకి చెందిన వీసీ దయానంద్ మనే మాత్రం కాస్త వెరైటీ. నిబంధనల ప్రకారం వర్సిటీలలోని లేడీస్ హాస్టల్స్ లో పురుషులెవరికీ అనుమతి ఉండదు. కానీ, ఈ వీసీ మాత్రం ఏం చక్కా లేడీస్ హాస్టల్ కి తన ఇంట్లోకి వచ్చినట్లు వచ్చాడు.
అది కూడా ఈవినింగ్ వాక్ తర్వాత ట్రాక్ సూట్ లో వచ్చి హాస్టల్ అంతా కలియతిరిగాడు. ఇదంతా హాస్టల్ లో ఉన్న సీసీ టీవీ రికార్డులో నమోదైంది. మూడు రోజుల్లో రెండు సార్లు హాస్టల్ కు వచ్చిన వీసీ అక్కడి విద్యార్థినిలతో ముచ్చటించినట్లు తెలిసింది. వీసీ వ్యవహారంతో ఇబ్బందిపడిన హాస్టల్ లోని విద్యార్థినులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.