నాటి మేటి తార కృష్ణ కుమారికి క్యాన్సర్ చికిత్స

First Published Apr 19, 2017, 8:41 AM IST
Highlights

క్యాన్సర్ చికిత్స కోసం  ఆమె బెంగుళూరు అపోలో ఆసుపత్రిలో చేరారు.

నాటి మేటి నాయిక కృష్ణ కుమారి క్యాన్సర్ చికిత్స కోసం బెంగుళూరు అపోలో ఆసుపత్రిలో చేరారు.

 

కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉన్నా,  ఈ మధ్యనే ఆమెకు బోన్ మ్యారో క్యాన్సర్ అని గుర్తించారు. ప్రస్తుతం ఆమె కెమో ధెరపీ తీసుకుంటున్నారు.

 

ఆమెకు ఓ పాజిటివ్ రక్తం అవసరమయిందని  సోషల్ మీడియా సమాచారం. అలనాటి తెలుగు తార కృష్ణకుమారికి ఒ పాజిటివ్ రక్తం  అవసరమని ఆ మధ్య బెంగుళూరుటైమ్స్ ఎడిటర్ కావ్య క్రిష్టఫర్ ట్వీట్ చేశారు.

 

 

సావుకారు జానకి అక్క అయిన కృష్ణకుమారి 1933లో పశ్చిమబెంగాల్ లోని నైహతిలో జన్మించారు. 1951లో తీసిన ‘నవ్వితే నవరత్నాలు’ అమె తొలి తెలుగు చిత్రం. నాటి అగ్రశ్రేణి నటులయిన ఎన్టీరామారావు, ఎఎన్ ఆర్, డా రాజ్ కుమార్, శివాజి గణేశన్ , కాంతారావు వంటి అందరితో ఆమె నటించారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలెన్నింటిలో నో ఆమె నటించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలు ఆమె తిరుగులేని నాయికగా వెలిగారు. సావిత్రి ఆమె సమకాలికనటి.

 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ మ్యాగజైన్ సంస్థాపకుడు  అయిన అజయ్ మోహన్ ఖైతాన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు, ఆమె పేరు దీపిక. వివాహం తర్వాత ఆమె బెంగుళూరులోనే స్థిరపడ్డారు. దీపిక ఈ మధ్య తల్లి జీవిత చరిత్ర రాశారు.

 

click me!