ఈ సిరియా ఫోటోగ్రాఫర్ కు జై కొట్టాల్సిందే...

First Published Apr 19, 2017, 7:22 AM IST
Highlights

బాంబు పేలుడుతో రక్తమోడుతున్న చిన్నారిని కాపాడటం కంటే ఆసమయంలో మరొక వృత్తి ధర్మం లేదని భావించాడు.  అరచేతుల్లో చిన్నారిని ఎత్తుకుని అంబులెన్స్  వైపు పరుగుతీశాడు ఫోటో గ్రాఫర్ హబక్

సంక్షోభ సమయంలో జర్నలిస్టుచేయాల్సిందేమిటి?

 

వృత్తి ధర్మానికి అతుక్కుపోవడమా లేక మానవ ధర్మం ప్రదర్శించి  సాటిమానువులను అదుకునేందుకు ముందుకు ఉరకడమా?

సిరియా యుద్ధభూమిలో డ్యూటిలో ఉన్న ఫొటోగ్రాఫర్‌ అబిద్ అల్కాదర్ హబక్ కు ఈ ప్రశ్న ఎదురయింది. అంతే, తన కెమెరా పక్కన పడేసి మనిషై నిలబడ్డాడు.

 

బాంబు పేలుడులో రక్తమోడుతున్న చిన్నారిని కాపాడటం కంటే ఆసమయంలో మరొక వృత్తి ధర్మం లేదని భావించాడు.  అరచేతుల్లో చిన్నారిని ఎత్తుకుని అంబులెన్స్  వైపు పరుగుతీశాడు.

 

ఈసంఘటన సిరియాలోని పశ్చిమ అలెప్పొ శివారుల్లోని  రిషిదీన్ వద్ద జరిగింది. అక్కడొక పెద్ద పేలుడు సంభవించింది. సైనిక దాడుల లో చిక్కున్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న బస్సులో బాంబులు పడ్డాయి. అందులో ఫోటోగ్రాఫర్ కూడా చిక్కుకున్నాడు. అయితే, క్షణాల్లో తేరుకుని లేచికూచున్నాడు. చట్టూర శవాల గుట్టలు కనిపించాయి.వాటిలో కొనవూపిరితో ఉన్న వాళ్లు కనిపించారు. వెంటనే ఆయనొక చిన్నారి దగ్గిర కు వెళ్లాడు. పాప చనిపోయింది. మరొక పసివాడిని అందుకున్నాడు. వూపిరాడుతూ ఉండటం గమనించాడు. హబక్‌  ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే బాలుడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్‌ వద్దకు చేర్చాడు. తర్వాత మరో బాలుడిని కాపాడేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఒక బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయిన హబక్‌ మోకాళ్లపై కూలబడిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యాలన్నిటిని ఇతర ఫొటోగ్రాఫర్లు చిత్రీకరిస్తూనే ఉన్నారు.

 

 

click me!