మహేందర్ రెడ్డి బన్ గయా ఇంటెరిమ్ డీజీపీ !

First Published Nov 10, 2017, 4:59 PM IST
Highlights
  • డిజిపి అనురాగ్ శర్మ అంతా అనుకుంటున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వయిజర్  కాబోతున్నారు
  • హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్

త్వరలో భారీఎత్తున ఐపీఎస్ లకు  స్థాననచలనం జరుగనున్నది.

ప్రస్తుతం సిటిపోలీస్ కమిషనర్ గా ఉన్న మహేందర్ రెడ్డి డిజిపి అయ్యేందుకు రంగం సిద్దమయింది. ఆయననను ఇంటెరిమ్ డిజిపి నియమించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించిన ఫైల్ మీద ముఖ్యమంత్రి కెసి ఆర్ సంతకం చేశారని తెలిసింది. అదే సమయంలో  రిటైర్ అవుతున్న డిజిపి అనురాగ్ శర్మ అంతా అనుకుంటున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అ డ్వయిజర్ అవుతున్నట్లు చెబుతారు. ఆయనను లా అండ్ ఆర్డర్, ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. నేడో రేపో ఉత్తర్వులు వెలవడనున్నాయని చెబుతున్నారు.  వెంటనే మహేందర్ రెడ్డి పోలీస్ బాస్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. దీనితో  1986 వ బ్యాచ్ కు చెందిన ఇతర అధికార్లకు కూడా  న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన కృష్ఱ ప్రసాద్ ను గ్లామర్ లేని రోడ్ సేఫ్టీ నుంచి తీసుకువచ్చి హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించనున్నారు. అయితే, ఇది కూడా అంతేగా.
ఇక, ఆదివారం నాడు మహేందర్ రెడ్డి కోొత్త పోలీస్ బాస్ గా  ఛార్జ్ తీసుకోనున్నారు.

దీనితో పాటు కింది  మార్పులు జరుగనున్నాయని ప్రచారం ఉంది.

-హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ?
-ఏసీబీ డీజీగా రాజీవ్ త్రివేది ?
-జైళ్ల శాఖ ఛీఫ్ గా తేజ్ దీప్ కౌర్ ?
-త్వరలో ఉత్తర్వులు !

ఇది ఇలా ఉంటే సిటీ పోలీస్ కమిషనర్ రేసులో ముగ్గురున్నారని చెబుతున్నారు.

జితేందర్, అంజనీ కుమార్, పూర్ణ చందర్ రావ్  ఈపోస్టు కోసం పోటీ పడుతున్నారని వార్తలు అందుతున్నాయి.
పోతే,  ఇపుడు మరుగున పడిన శివధర్ రెడ్డి ని సిటీ పోలీస్ అదనపు కమిషనర్ (కో ఆర్డినేషన్) గాబాధ్యతలు స్వీకరించవచ్చని అంటున్నారు.

మరిన్ని వివరాలు...

-అదనంగా ఐపీఎస్ లను కేటాయించాలని గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి.
-కేంద్రం నుంచి వెనక్కి రానున్న డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీపీ విజయ్ కుమార్ (శిఖా గోయల్, ఐపీఎస్ భర్త) లు !
-పోలీస్ శాఖలో దాదాపు అన్ని డీజీ పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ?
-విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫైర్ సర్వీసెస్, ఆర్టీసీ (ఎండీ), రోడ్ సేఫ్టీ అండ్ రైల్వేస్ తదితర విభాగాల్లో డీజీ స్థాయి పోస్టులు.
-మరికొంత మంది అడిషనల్ డీజీలకు డీజీలుగా పదోన్నతులు ?

త్వరలో కేంద్రానికి డీజీల ప్యానెల్

అసెంబ్లీ సమావేశాల తరవాత కేంద్రానికి డీజీపీల ప్యానెల్ ను పంపనున్న రాష్ట్రం.

యూపీఎస్సీ ఎంపానెల్ చేసిన ముగ్గురు అధికారుల నుంచి ఒకరిని రెగ్యులర్ డీజీపీగా నియమించనున్న ప్రభుత్వం.

కేంద్రానికి పంపే జాబితాలో అడిషనల్ డీజీల పేర్లు ! డీజీ ఎంపానల్మెంట్ కు సిఫారసు ?

click me!