అసెంబ్లీ మొత్తం ‘జగన్’ చర్చే

Published : Nov 10, 2017, 04:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అసెంబ్లీ మొత్తం ‘జగన్’ చర్చే

సారాంశం

టీడీపీ నేతలకు జగన్ ఫోబియా ప్రతిచోటా జగన్ గురించే చర్చ జగన్ గురించి మాట్లాడకపోతే ఉండలేని స్థితిలో టీడీపీ నేతలు

అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు జగన్ ఫోబియా పట్టుకున్నట్లుంది. అందుకే ఏ ఇద్దరు నేతలు కలిసినా.. జగన్ గురించి తప్ప మరే టాపిక్ గురించి మాట్లాడుకోవడం లేదు. జగన్.. తన మానాన తాను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి.. పాదయాత్ర చేసుకుంటుంటే కూడా ఆయనని టీడీపీ నేతలు వదలడం లేదు. నిన్నటి దాకా.. ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పై విమర్శలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. శుక్రవారం అసెంబ్లీలోనూ ఆయన గురించే చర్చించుకున్నారు.

చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను వ్యతిరేకిస్తూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో.. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగాయి. వారి జబ్బలు వాళ్లే చరుచుకుంటూ.. చప్పట్లు కొట్టుకున్నారు. ఇక అసెంబ్లీ లాబీలో, మీడియా పాయింట్ లో, మంత్రుల ఛాంబర్ లోనూ.. ప్లేస్ ఏదైనా టాపిక్ మాత్రం ‘జగన్’ .

‘‘పాదయాత్రకు జగన్‌ అనుమతి తీసుకున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ అనుమతే కోరనంటున్నారు. పాదయాత్ర చేసే ఉద్దేశం లేకనే... ముద్రగడ అనుమతి కోరడం లేదు’’ అని హోమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. పాదయాత్ర మధ్యలో కోర్టుకు వెళ్లాల్సి రావడంతో... జగన్ అవినీతిపై మళ్లీ చర్చ జరుగుతోందని మరో మంత్రి కళా వెంకట్రావు అన్నారు. జగన్ పాదయాత్ర చేసినా టీడీపీకి ఇబ్బంది ఉండదని, జగన్‌ది వాయిదాల పాదయాత్రేనని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎద్దేవాచేశారు. 4రోజులు నడవగానే పాదయాత్రకు బ్రేక్ పడిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా జగన్ పై మండిపడ్డారు.

జగన్ నాలుగోరోజు నడక మానేసి అత్తారింటి దారిపట్టాడని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యేలు జారిపోతారన్న భయంతోనే అసెంబ్లీని బహిష్కరించారని, రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాల్లో డబ్బు లేదన్న జగన్ మనదేశంలో ఉందని ఒప్పుకున్నట్లేనని, సీఎం చంద్రబాబును విమర్శించడానికే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

అసెంబ్లీకి జగన్ వచ్చినా, రాకపోయినా, పాదయాత్ర చేసినా, చేయకపోయినా.. ఆయన గురించి మాట్లాడుకోకుండా టీడీపీ నేతలు ఉండలేరనే స్థాయికి చేరిపోయారు. మంత్రులు వాళ్లవాళ్ల శాఖల గురించి, చంద్రబాబు గురించి కూడా ఇంతలా మాట్లాడుకుంటారో లేదో తెలీదు గానీ.. జగన్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !